Trending news

Minister Nimmala Ramanaidu: కృష్ణా నదిలో ఇదే రికార్డు ఫ్లడ్‌.. అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..

[ad_1]

  • ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్..

  • అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..

  • వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది..

  • వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దన్న మంత్రి నిమ్మల రామానాయుడు..
Minister Nimmala Ramanaidu: కృష్ణా నదిలో ఇదే రికార్డు ఫ్లడ్‌.. అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు..

Minister Nimmala Ramanaidu: అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది.. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కరకట్ట దగ్గర అవుట్ స్లూయుజ్ గండిని పూడ్చడానికి జరుగుతున్న పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. 11.80 లక్షల క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదికి వస్తుంది. ఇది కృష్ణానది చరిత్రలోనే అతి ఎక్కువ ఫ్లడ్ అన్నారు.. పరిపాలనాదక్షుడు చంద్రబాబు సీఎంగా ఉండటంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్య ఫలితమే బుడమేరుకు వరద అన్నారు.. ఇవాళ రాత్రికి బుడమేరుకు పడిన మూడు గండ్లను పుడుస్తామన్న ఆయన.. ఇందు కోసం అధికారులు తీవ్రంగా పనిచేస్తున్నారని వెల్లడించారు. కరకట్టపై మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ వద్ద షట్టర్ కి గ్రీజ్ కూడా పెట్టలేదని విమర్శించారు.. ప్రకాశం బ్యారేజీ గేట్లకు బొట్లు తగిలి గేట్లు కొంత దెబ్బతిన్నాయన్నారు. గేట్ల నిపుణు మరమత్తులు చేయనున్నారు. ప్రస్తుతానికి గేట్లు వలన ఇబ్బంది లేదన్నారు.

Read Also: TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”

అతి తక్కువ గంటల్లో భారీగా వర్షం పడింది. వరద ప్రభావం లేని అధికారులను విజయవాడకి తెప్పిస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. చుట్టూ పక్కల నగరాల నుంచి ఫుడ్ ప్యాకెట్లను రప్పిస్తున్నాం. ప్రకాశం బ్యారేజీకి ఒకేసారి నాలుగు బోట్లు గుద్దుకోవడం వెనుక కుట్ర కోణం లేకపోలేదు అనే అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు అలాంటి వాళ్లే అని ఆరోపించారు.. అమరావతి రాజధానిపై వైసీపీ విషం చిమ్మడం మొదటి నుంచి చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై లాంటి మహా నగరాలు చిన్న వర్షాలకే మునిగిపోతున్నాయి.. కానీ, అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు అన్నారు.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close