Trending news

Medchal Crime: హాస్టల్‌ ఫీజు వ్యవహారంలో గొడవ..? యువకుడు మృతి..

[ad_1]

  • హాస్టల్ ఫీజు వ్యవహారంలో ఓ యువకుడిపై కొందరు యువకులు దాడి..

  • గ్యాస్ పైపులు- పిడుగుద్దులతో గుద్ది చంపినట్లు స్థానికులు..
Medchal Crime: హాస్టల్‌ ఫీజు వ్యవహారంలో గొడవ..? యువకుడు మృతి..

Medchal Crime: హాస్టల్ ఫీజు వ్యవహారంలో ఓ యువకుడిపై కొందరు యువకులు దాడి చేసిన ఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది. అర్థరాత్రి కొందరు యువకులు, ఒక యువకుడిని గ్యాస్ పైపులు, పిడుగుద్దులతో గుద్ది చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా హాస్టల్ లో నివాసముండే యువకులు దాడికి దిగినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

Read also: Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..

ఏం జరిగింది..

విగ్నేశ్వర వసతి గృహంలో నాలుగు నెలల క్రితం నివాసం ఉన్న కళ్యాణ్ అనే యువకుడు హాస్టల్ ఫీజు కట్టలేక హాస్టల్ వదిలి వెళ్ళిపోయాడు. అయితే.. గత రాత్రి రూ. 27వేలు చెల్లించాల్సింది ఉండగా రూ.17వేలు చెల్లిద్దామని తీసుకొని హాస్టల్ వచ్చాడు కళ్యాణ్. అయితే హాస్టల్ నిర్వాహకులు ఆ డబ్బులు తీసుకోకుండా వెనక్కి వెళ్లాలని కోరారు. దీంతో మేడ్చల్ పోలీస్టేషన్ పరిధి వినాయక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 లో కళ్యాణ్ వెలుతుండగా కొందరు యువకులు గుంపుగా అతని వద్దకు వచ్చారు. కళ్యాణ్ పై కొందరు యువకులు పిడుగులు తగ్గుద్ది, గ్యాస్ పైపులతో కొడుతూ దాడి చేశారు.

దీంతో కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నడిరోడ్డుపై జరుగుతున్న దాడిని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వసతి గృహం నిర్వాహకులను, స్థానికంగా ఇతర హాస్టల్లో నివాసం ఉంటున్న యువకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే హాస్టల్ నిర్వాహకులే కళ్యాణ్ పై దాడి చేయించారా? లేక కళ్యాణ్ వద్ద రూ.17వేలు తీసుకునేందుకు దాడి చేసి చంపారా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Deputy CM Pawan Kalyan: ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్‌.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్‌



[ad_2]

Related Articles

Back to top button
Close
Close