Trending news

Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? ఫోటోస్ చూస్తే..

[ad_1]

Manasantha Nuvve: ‘మనసంతా నువ్వే’ హీరోయిన్‏కు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా.. ? ఫోటోస్ చూస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథ. డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ 2001లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్‏లో దూసుకుపోతున్నాయి. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ అప్పట్లో యూత్‏ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తనికెళ్ల భరణి, సునీల్, తనూరాయ్, చంద్రమోహన్ కీలకపాత్రలలో నటించారు. మనసంతా నువ్వే సినిమాతో అప్పట్లో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రీమా సేన్. ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలో కొన్ని సినిమాల్లో నటించిన రీమా సేన్. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది.

కోల్ కత్తాలో జన్మించిన రీమాసేన్ నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అనేక ప్రకటననలో నటించిన ఈ బ్యూటీ.. ఉదయ్ కిరణ్ సరసన మనసంతా నువ్వే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంద. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న రీమా సేన్ ఆ తర్వాత హమ్ హూయే ఆప్ కే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆ మూవీ ప్లాప్ కావడంతో అక్కడ అంతగా క్లిక్ కాలేకపోయింది. అలాగే తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించినా.. ఆశించిన స్థాయిలో ఆఫర్స్ మాత్రం అందుకోలేదు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది.

2012లో వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 2013 ఫిబ్రవరి 22న రుద్రవీర్ అనే బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రీమా సేన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. చాలాకాలంగా సినిమా ఈవెంట్లకు, పార్టీలకు దూరంగా ఉంటుంది రీమా సేన్. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రీమా సేన్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ముఖ్యంగా రీమా సేన్ కొడుకు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Reema Sen (@senreema29)

 

View this post on Instagram

 

A post shared by Reema Sen (@senreema29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close