Trending news

Mallu Bhatti’s Vikramarka counter to KTR

[ad_1]

  • అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు..
  • అలాంటి చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు..
  • వాళ్ళు ప్రజల సమస్యల కోసం ఏనాడు సచివాలయానికి రాలేదు..
Bhatti Vikramarka: పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? కేటీఆర్‌కు భట్టి కౌంటర్..

Bhatti Vikramarka: పరిశ్రమలు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారం కోల్పోయినప్పుడల్లా అమాయక ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అలాంటి చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. వాళ్ళు ప్రజల సమస్యల కోసం ఏనాడు సచివాలయానికి రాలేదన్నారు. ఎప్పుడు ప్రభుత్వాన్ని అట్లా కూల్చాలి, ఇట్ల కూల్చాలని చూస్తున్నారని తెలిపారు. ఇది దుర్మార్గపు చర్య అన్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ప్రజా స్వామ్యయుతంగా సహకరించాలన్నారు. పరిశ్రమ లు పెట్టాలని చేసేది ప్రభుత్వ వైఫల్యమా? అన్నారు. నిరుద్యోగుల కోసమే ప్రత్యేక తెలంగాణ ను తెచ్చుకున్నామన్నారు.

రైతుల కోసం 18వేల కోట్లు ఋణమాపి చేసినామని అన్నారు. పంట నష్టం రైతులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ చెల్లించడం వైఫల్యమా? అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యమా? అని ప్రశ్నించారు. కొంతమంది కులగణన జరగకుండా చూస్తున్నారని తెలిపారు. కులగణన జరిగితే పూర్తి స్థాయి అవశాలు వస్తాయి కదా! అని తెలిపారు. కులగణన ఫుల్ బాడీ టెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. నెహ్రు జయంతి సందర్భంగా భట్టి మాట్లాడతూ. నెహ్రు గురించి కొంతమంది తప్పుడు ప్రచారం మంచిదన్నారు. భారత దేశ స్వాతంత్రం కోసం నెహ్రు అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపాడన్నారు. స్వతంత్ర సంగ్రహం గురించి తెలుసుకుంటే మంచిదన్నారు.
Sangareddy Crime: నా కొడుకును చంపారు అందుకే చంపేసా.. బొంతపల్లిలో డబుల్ మర్డర్..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close