Trending news

Mahesh Babu: బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’పై మహేష్ ప్రశంసలు!

[ad_1]

  • మారుతీనగర్‌ సుబ్రమణ్యంపై మహేష్ రివ్యూ
  • బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ పొగడ్త
  • తబితకు ప్రత్యేక అభినందనలు
Mahesh Babu: బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’పై మహేష్ ప్రశంసలు!

Mahesh Babu About Maruthi Nagar Subramanyam: మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలో ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. సినిమాలో తనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు మహేష్ రివ్యూ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం బెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. చిత్ర నిర్మాత తబిత సుకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.‍

మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ మహేష్ బాబు తన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘వాట్ ఏ హిలేరియస్ రైడ్. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లో మారుతి నగర్ సుబ్రమణ్యం ఒకటి. నిర్మాత తబిత సుకుమార్‌, చిత్ర బృదంకు అభినందనలు’ అని సూపర్ స్టార్ రాసుకొచ్చారు. మహేశ్ తమ సినిమాను అభినందించడంపై తబిత సుకుమార్ స్పందించారు. ‘మా సినిమాను చూసి మద్దతు ఇవ్వడం చాలా సంతోషం. మీ సపోర్ట్‌ లభించడం మా మూవీకి పెద్ద ఘనత’ అని పేర్కొన్నారు.

Also Read: KL Rahul-LSG: కెప్టెన్‌గా అద్భుతం.. లక్నోలోనే రాహుల్‌!

లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమా.. తబితా సుకుమార్ సమర్పణలో విడుదలైంది. ఇందులో రావు రమేశ్‌ కీలక పాత్ర పోషించారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్‌ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతరం సైతం ఎంజాయ్ చేస్తోంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close