Trending news

Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు

[ad_1]

  • ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు

  • కీచక గురువును చితకబాధిన స్థానికులు

  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన
Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయినా కూడా అబలలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ ట్యూషన్ మాస్టర్ కీచకుడిగా మారాడు. పాఠాలు బోధించాల్సిన వాడు నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలికలు.. తల్లిదండ్రులకు చెప్పడంతో కీచక గురువును చితకబాదారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?

విరార్‌ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకు అని తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో కామాంధుడికి బుద్ధి చెప్పారు. బట్టలు విప్పి చితకబాదారు. అనంతరం చెప్పుల దండ వేసి ఊరేగించారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ పవార్ విలేకరులకు తెలిపారు. ట్యూషన్ టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని ట్యూషన్ మానేయడంతో బయటపడింది. ఇలా పలువురి విద్యార్థినులను టీచర్ వేధించినట్లుగా తెలుస్తోంది. స్థానికులు ట్యూషన్ సెంటర్‌ను ధ్వంసం చేశారు.

ఇది కూడా చదవండి: Condom Use: యూరోపియన్ టీనేజర్లలో తగ్గుతున్న కండోమ్ వాడకం.. డబ్యూహెచ్‌ఓ ఆందోళన..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close