Maganti Gopinath : ప్రజాపాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి….

[ad_1]

చెక్కులు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే అందించాలని హై కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మంత్రి పొన్నం కావాలనే అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయాల్సి ఉండగా చెక్కుల పంపిణీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకొని ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. అవగాహన లేక ఎమ్మార్వో కార్యాలయాల్లో చెక్కుల పంపిణీ చేయాలని సూచించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకు పాలకుల సేవలు ఉండేవన్నారు. ప్రజా పాలన అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలని, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల కై ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..
ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లడం అనేది వ్యయప్రయసాలకు గురి కావడమే అని ఆయన అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చెక్కులు అనేది ఆయా నియోజక వర్గ ఎమ్మెల్యేల ద్వారా మాత్రమే పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు సేవ చేయడం సులువు అవుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ 24 గంటలు అందించామని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ మంజూరు కావడం ఆనంద దాయకమని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలు మరువలేదన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
Pushpa 2: 100 రోజుల్లో పుష్పగాడి రూలింగ్!
[ad_2]