Lockdown నీ ఉల్లంగిస్తే ఆరు నెలల జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయలు జరిమానా
Lockdown is a thousand rupees fine plus six months in jail if you violate it

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లొ కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రజలంతా ఖచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికి కొన్ని చోట్ల లాక్ డౌన్ ప్రభావం కనిపించడం లేదు. దింతో కేంద్ర సర్కార్ లాక్ డౌన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదెశించింది.
లాక్ డౌన్ చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని కెంద్రం అమలులోకి తెచ్చింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంభుంచిన వారి పై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఈ సెక్షన్ ప్రకారం 6 నెలల జైలుశిక్ష, 1000 రూపాయల జరిమానా విధించే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉన్న సేవలు తప్ప మిగతావన్నీ ఆపేయాల్సిందే.
అత్యవసర వాహనాలు మినహా ఏ వాహనాలు రోడ్డు ఎక్కినా సెజ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది. అవసరమైతే లాఠీఛార్జీ కూడా చేసే అధికారం ఉంటుంది. ఈ చట్టంలోని నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలీసులు బైక్ లపై తిరిగినా, నలుగురికంటే ఎక్కువ మంది ఒకచోట ఉన్నా లాఠిఛార్జి చేస్తున్నారు. ఏపి, తెలంగాణలో కూడా పలు వాహానాలను సీజ్ చేశారు. ఏప సర్కార్ 1897 అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని
అమలులోకి తెస్తూ జీఓఆర్టి నంబర్ 209 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ సర్కార్ జీవో నంబర్ 45,46 ను జారి చేసింది. లాక్ డౌన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు హైదరాబాద్‌లో సోమవారం ఒక్కరోజే 2వేలకు పైగా వాహనాలను సిజ్ చేసి, కేసులు నమోదు చేశారు. వీటిలో 1058 బైక్‌లు, 948 ఆటోలు, 429 కార్లు, ఇతర ఫోర్ వీలర్లు, 45 ఇతర వాహనాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు పరిస్థితిని అర్ధం చేసుకొని సహకరించాలని పోలిసులు కోరారు. అవసరమైతే లాథీఛార్టీకి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
మార్చి 31 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్న కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఇళ్లలో నుంచి రావద్దని ఏప్,తెలంగాణ సీఎంలు కోరారు. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇరు రాష్ట్రాల్లి అధికారులు కూడా లాక్ డౌన్ అతిక్రమించే వారి పై కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.