Lockdown ఏప్రిల్ 20 తర్వాత సడలింపు ప్రాంతాలు ఇవే
These are the relaxation areas after Lockdown April 20th

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు లాక్ డౌన్ నుమే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న నిబంధనలు ఎప్రిల్ 20 వరకు కొనసాగుతాయని వెల్లడించిన మోదీ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఏప్రిల్ 20 తర్వాత కొన్ని నిబంధనలను సడలిస్తామని పెర్కొన్నారు. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ రేపు విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 20 తర్వాత లాక్ డౌన్ లో సడలింపులు ఎలా ఉంటాయన్న దానిపై దేశవ్యాప్త చర్చ మొదలైంది. రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, కరోనా హాట్ స్పాట్ లపై మార్గదర్శకాల్లొ పేర్కొనే అవకాశముంది.
హాట్ స్పాట్ లు, రెడ్ జోన్లలో ఇప్పుడున్న కఠిన నిబంధనలే అమల్తొ ఉంటాయని అధికార వర్గాల సమాచారం. కరోనా వ్యాప్తి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నందున నిబంధనల్లో సడలింపు ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆర్దిక వ్యవస్థ కూడా ముఖ్యమన్న మోదీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని ఉదాహరణగా చెప్తున్నారు. చిరు వ్యాపారస్తులకు, రోజువారీ కూలిలకు ఊతమిచ్చేలా ఈ సడలింపులు ఉండవచ్చు..
మహారాష్ట్ర ఢిల్ల, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున అక్కడ సడలింపులు ఎక్కువగా ఉండకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సడలింపులు ఉండొచ్చంటున్నారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరాఖండ్, జార్ధండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా నియంత్రణలోనే ఉంది.
ఏదిఏమైనప్పటికీ, లాక్ డౌన్ వల్ల భారత్ లో కరోనా నియంత్రణలో ఉందనే చెప్పాలి. ఢిల్ల ఘటన తర్వాత కేసుల పెరుగుదల ఆందోళన కలిగించినప్పటికి ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ 20 తర్వాత ప్రజలకు ఆర్ధికంగా వెసులుబాటు కలిగించే నిర్ణయాలు రేపటి గైడ్ లైన్స్ లో ఉండనున్నాయి. ఆకలికేకలను నియంత్రించేందుకు 30ద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కెంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో కరోనాను త్వరలోనే అంతమొందించగలమనే భావన రోజురోజుకీ పెరుగుతోందని అభివ్రాయపడుతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.