Lip Care: లిప్‌స్టిక్ వాడకుండా పెదాలు ఎర్రగా, మెరుస్తూ ఉండాలంటే ఇలా చేయండి..

[ad_1]
మహిళల అందాన్ని పెంచడంలో పెదాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పెదాలు ఎర్రగా, మెరుస్తూ కనిపిస్తే వచ్చే అందమే వేరు. ఈ క్రమంలోనే చాలా మంద ఆడవాళ్ళు లిప్ స్టిక్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ కొంత మంది పెదాలు నిర్జీవంగా, పొడి బారి పోయి ఉంటాయి. కాబట్టి వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
పెదవలు అందాన్ని కోల్పోవడానికి చాలా కారణాలు ఉాంటాయి. పెదవులపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించే మహిళలు లిప్ స్టిక్ వాడకుండానే నేచురల్‌గా పెదాలను ఎర్రగా, మెరిసేలా చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెదవుల అందాన్ని పెంచడంలో తేనె ఎంతో చక్కగా సహాయ పడుతుంది. కలబంద గుజ్జులో కొద్దిగా తేనె కలిపి పెదాలపై రాయాలి. కాసేపు మర్దనా చేసి ఓ పావు గంట సేపు తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల పెదాలు సాఫ్ట్‌గా, తేమగా ఉంటాయి.
పెదాలు ఎర్రగా, హైడ్రేట్‌గా ఉండాలంటే ముందు నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. పెదాలను ఎర్రగా మార్చడంలో బీట్ రూట్ కూడా చక్కగా పని చేస్తుంది. కొద్దిగా బీట్ రూట్ రసాన్ని తీసుకుని.. కొద్ది సేపు అలానే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. ఇలా చేస్తే పెదాలు పింక్ రంగులోకి మారతాయి.
బాదం నూనె, తేనె, పంచదార మూడింటిని గిన్నెలోకి తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసి.. సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోతాయి. పెదాలు కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి.
[ad_2]