Trending news

Lifestyle: పసుపు పాలు తాగుతున్నారా.? ఓసారి ఆలోచించుకోవాల్సిందే..

[ad_1]

పాలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని నిపుణులు సైతం చెబుతుంటారు. జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలకు పసుపుపాలు బాగా ఉపయోగపడతాయి. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియాలు, యాంటీ ఇన్ఫెక్షన్‌ వంటి ఎన్నో మంచి గుణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించడంలో సహాయపడతాయి. అయితే కొందరికి పాలు, పసుపు కలిపి తీసుకుంటే కొందరికి సమస్యలు తప్పవని అంటున్నారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పసుపు,పాలు తీసుకోకూడదని అంటున్నారు. అవేంటంటే..

* జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పసుపు, పాలను కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొందరిలో ఇవి.. గ్యాస్, ఉబ్బరం, అతిసారం, కడుపు నొప్పి, వికారం లేదా తిమ్మిరి వంటి సమస్యలు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* కొందరిలో చర్మ సంబంధిత సమస్యలకు పసుపుపాలు కారణమవుతుందని అంటున్నారు. ముఖ్యంగా కొందరిలో ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుండొచ్చని అంటున్నారు. చర్మంపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ అలవాటును మానేయాలి.

* మధుమేహం, కీమోథెరపీ సంబంధిత వ్యాధులకు మెడిసిన్స్‌ ఉపయోగించే వారు కూడా పసుపు, పాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తం పలుచన చేసే మందులు ఉపయోగించే వారు కూడా పసుపుపాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

* పిత్తాశయ సమస్యలతో బాధపడేవారు కూడా పసుపుపాలకు దూరంగా ఉండాలని అంటున్నారు. పసుపు పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. ఇది పిత్తాశయ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

* పసుపు పాలను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రి పిండాల్లో రాళ్లు పెరిగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కంటి సమస్యలతో బాధపడేవారిలో కూడా పసుపు పాలు బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. కాబట్టి పసుపు పాలు తీసుకునే అలవాటు ఉంటే వైద్యుల సూచనలు పాటించాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close