Trending news

Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?

[ad_1]

  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి.
  • ఎప్పటి నుంచో సీక్వెల్ వస్తుందని చాలా వార్తలు వచ్చాయి.
  • ఈ విషయం సంబంధించి తాజాగా ఓ విషయం వైరల్ గా మారింది.
Kushi Sequel: ఖుషి సీక్వెల్ ఇక లేనట్లేనా..?

Kushi Sequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హీరోయిన్ భూమిక జంటగా నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా తమిళంలో ఎస్ జె సూర్య దర్శకత్వంలో హీరో విజయ్, జ్యోతిక కలిసి నటించారు. ఆ సినిమానే తెలుగులో రీ మేకింగ్ గా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులో భారీ విజయం సాధించింది. నిజానికి ఏ సినిమా అయినా సరే రీమేక్ చేస్తే.. ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫీల్ పోతుందని భావిస్తారు. అయితే ఖుషి సినిమాకు మాత్రం అలా జరగలేదు. ఊహించిన దానికంటే.. ఎక్కువగా విజయం సాధించింది. ఖుషి సినిమాలోని పాటలు, యాక్షన్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఇలా అనేక అంశాలతో సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలలో ఇష్టమైన సినిమా ఏంటి అంటే ఖుషి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే, ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ వస్తుందని చాలా వార్తలు వచ్చాయి. నిజానికి పవన్ అభిమానులు కూడా ఎందరో సినిమాకు సీక్వెల్ చేయాలని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇకపోతే ఈ విషయం సంబంధించి తాజాగా ఓ విషయం వైరల్ గా మారింది.

HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమా సీక్వెల్ ను ఇదివరకే ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కి కథ తెలిపాడట. అయితే, అందుకు ఖుషి టైటిల్ కాకుండా మరో పేరు పెట్టి కథను తయారు చేసినట్లు తెలిపాడు. ఆ కథ కూడా పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిందని తెలియజేశాడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నచ్చిన కూడా తాను ఇప్పుడు లవ్ స్టోరీలు చేసే పరిస్థితిలో లేనని., ఆ పరిస్థితి నుండి నేను ఎప్పుడో దాటిపోయాను అంటూ చెప్పుకొచ్చాడట పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని స్వయంగా ఎస్ జె సూర్య తెలియజేశారు. ఇకపోతే ప్రస్తుతం మన జనరేషన్ లో ఈ సినిమాకి ఎవరు సరిపోతారన్న విషయాన్ని తెలుపుతూ.. హీరో నాని, రామ్ చరణ్, తలపతి విజయ్ పేర్లు ఆయన తెలిపారు. హీరోయిన్ గా ప్రియాంక ఆరుళ్ మోహన్ ఉంటే చాలా బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్య నటుడిగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close