Kolkata rape-murder: మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’.. దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ..

[ad_1]
- మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’..
-
విమర్శల దాడిని తీవ్రం చేసిన బీజేపీ.. -
ఆమె ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడటం లేదన్న కేంద్రమంత్రి..

Kolkata rape-murder: కలకత్తా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. డాక్టర్లతో పాటు సాధారణ ప్రజలు ఆందోళనలు, నిరసనలు తెలియజేశారు. ముఖ్యంగా ఘటన జరిగి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ముందు నుంచి సీఎం మమతా బెనర్జీ సర్కార్, రాష్ట్ర పోలీసులు వైఫల్యం చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసుని విచారిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై బెంగాల్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల్ని మమతా బెనర్జీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. బుధవారం జరిగిన నిరసనల్లో ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించారు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మమతా బెనర్జీపై బీజేపీ విమర్శల దాడిని ఎక్కువ చేసింది.
Read Also: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మహిళా మావోలు మృతి
తృణమూల్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) 27వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తూ.. మీరు బెంగాల్‌ని తగలబెడితే అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు, యూపీ, బీహార్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ తగలబడుతాయి అని బీజేపీని హెచ్చరించింది.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ.. మమతా బెనర్జీని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌తో పోల్చారు. ఆమె ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడలేని అన్నారు. ఇది ముఖ్యమంత్రి వాడే భాష కాదని అన్నారు. కిమ్ జోంగ్ ఉన్ తన వ్యతిరేకతను సహించడు, అదే విధంగా మమతా బెనర్జీ తన ప్రతిపక్షాల మాటల్ని సహించదు అని అన్నారు.
న్యాయం చేయాలని కోరడం అశాంతి కలిగించడం లాంటిదని ఆమె మాట్లాడుతోందని, ఇది నిరసనకారుల్ని, వైద్యుల్ని అవమానపరచడమే అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో నేరస్తులు తప్పా ఎవరూ సురక్షితంగా లేని చెప్పారు.
[ad_2]