Kolkata Doctor Case: ఒక్క వ్యక్తి 41 మంది పోలీసుల్ని గాయపరిచాడా..? మమతా సర్కార్ పరువు పాయే..

[ad_1]
- ఒక్క వ్యక్తి 41 మంది పోలీసుల్ని గాయపరిచాడా..?
వైద్యురాలి ఘటనపై ఆందోళనకు పిలుపునిచ్చిన విద్యార్థి నేత అరెస్ట్.. -
హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన బెంగాల్ సర్కార్.. -
ఒక్క వ్యక్తిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసినట్లు..? -
బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు..

Kolkata Doctor Case: కోల్‌కతా ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కేంద్రంగా మారింది. 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలు నైట్ డ్యూటీలో ఉన్న సమయంలో దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైద్యులు తీవ్ర నిరసన తెలియజేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన ఇప్పటికీ ఆందోళనలకు కారణమవుతోంది. ఈ కేసులో ప్రభుత్వం, పోలీసులు సరిగా వ్యవహరించలేదని చెబూతూ కలకత్తా హైకోర్టు కేసుని సీబీఐకి అప్పగించింది.
ఇదిలా ఉంటే, బెంగాల్ రాష్ట్ర సెక్రటేరియట్ నబన్నని మట్టడించాలని ఆగస్టు 27న నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చిన విద్యార్థి నాయకుడు బెయిల్‌ని సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టేసింది. మంగళవారం రాష్ట్ర సచివాలయానికి మెగా ర్యాలీకి పిలుపునిచ్చిన పశ్చిమ బంగా ఛత్ర సమాజ్ నాయకుడు సయన్ లాహిరిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అశాంతిని సృష్టించేందుకు బీజేపీ ఈ నిరసనని నిర్వహించిందని అధికార తృణమూల్ సర్కార్ ఆరోపించింది.
Read Also: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
లాహిరి అరెస్ట్‌ని సవాల్ చేస్తూ అతడి తల్లి కలకత్తా హైకోర్టుని ఆశ్రయించారు. అతనికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సర్కార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. లాహిరిని ఎందుకు అరెస్ట్ చేశారని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘వందల మందిలో మీరు ఆ వ్యక్తిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు..?’’ ర్యాలీకి పిలుపునిచ్చిన ముగ్గురిలో లాహిరి కూడా ఉన్నాడని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకి వెల్లడించారు. నిరసనకారుల దాడిలో 41 మంది పోలీసుల గాయపడినట్లు చెప్పారు. అయితే, ఇందుకు సుప్రీకోర్టు బదులిస్తూ..‘‘41 మంది పోలీసులు గాయపడ్డారని మీరు అంటున్నారు. ఈ వ్యక్తి 41 మంది పోలీసుల్ని గాయపరిచాడని చెప్పాలనుకుంటున్నారా..? సారీ, ఈ కేసులో మెరిట్ లేదు, కేసుని డిస్మిస్ చేస్తున్నాం’’ అని చెప్పింది.
లాహిరికి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించడంపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. యువత గొంతుని అణిచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భారీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. యువత శక్తికి నా వందనం అని ట్వీట్ చేశారు. అంతకుముందు శాంతియుత నిరనసలపసై బెంగాల్ ప్రభుత్వం అధికారాన్ని ప్రయోగించవద్దని హెచ్చరించింది. ఆగస్టు 09న జరిగిన వైద్యురాలి హత్యచార ఘటన వెస్ట్ బెంగాల్‌లో నిరసన, ఆందోళనల్ని నిర్వహిస్తున్నారు.
[ad_2]