KL Rahul-LSG: కెప్టెన్‌గా అద్భుతం.. లక్నోలోనే రాహుల్!

[ad_1]

Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు (ఎల్‌ఎస్‌జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఎల్‌ఎస్‌జీ.. ఈ సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రాహుల్‌ను కెప్టెన్సీని నుంచి తప్పించడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల గోయెంకాను రాహుల్ కలవడం, తామంతా ఓ కుటుంబంలా ఉంటామని సంజీవ్ అనడం నెట్టింట ఊహాగానాలకు చెక్ పడింది.
తాజాగా ఎల్‌ఎస్‌జీ ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. లక్నోలోనే రాహుల్ కొనసాగనున్నాడని అర్ధమవుతోంది. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాంటీ రోడ్స్ పలు విషయాలపై అతడు స్పందించాడు. ‘అత్యుత్తమ బ్రాండ్ కలిగిన ఫ్రాంచైజీని నడిపించడం సాధారణ విషయం కాదు. ఎల్‌ఎస్‌జీ రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ, జట్టును నడిపించే విధానం చాలా కాలంపాటు సాగుతుందనడంలో ఎలాటి సందేహం లేదు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ రికార్డులను చూస్తే వారు ట్రోఫీలను గెలిచారు. ఎల్‌ఎస్‌జీ కూడా ఫైనల్‌కు చేరి ఓ టైటిల్ సాధిస్తే బాగుంటుందనేది మేనేజ్‌మెంట్ ఆకాంక్ష’ అని ఎల్‌ఎస్‌జీ ఫీల్డింగ్ కోచ్ పేర్కొన్నాడు.
Also Read: All Time IPL XI: ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్‌కు దక్కని చోటు! కెప్టెన్‌గా..
‘ఆరంభంలో ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు. విజయాలు సాధించడం అలవాటు చేసుకున్నాక.. ఆ జట్ట వెనుదిరిగి చూడలేదు. లక్నో కూడా అదే పరిస్థితుల్లో ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా అద్భుతమైన పనితీరు కనబరిచాడు. రాహుల్‌పై అందరికి నమ్మకం ఉంది. ఐపీఎల్ 2025లో కప్ సాధించేందుకే ప్రయత్నిస్తాం’ అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివరలో ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం జరగనుంది. అప్పుడు జట్లన్నీ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
[ad_2]