Kitchen Hacks: వర్షా కాలంలో బట్టలు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

[ad_1]
సాధారణంగా వర్షా కాలం అంటే పెద్దగా ఎవరికీ ఇష్టం ఉండదు. ఎంత ఎండ ఉన్నా భరిస్తారు కానీ.. వర్షం వచ్చిందంటే.. ఎక్కడికీ వెళ్లడానికి ఉండదు. ఇల్లంతా గందరగోళంగా అనిపిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. అందులోనూ వర్షం వచ్చిందంటే మహిళలకు మరింత చికాకు అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే బట్టల నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా సరే.. సరిగా ఆరక పోవడంతో చెడు వాసన వస్తూ ఉంటాయి. దీంతో మళ్లీ వాటిని ఉతకాల్సి వస్తుంది. ఇలా ప్రతీ ఇంట్లో ఈ సమస్యను ఎదుర్కునే ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడేయటానికే మీ కోసం మంచి చిట్కాలు తీసుకొచ్చాం. వీటిని కనుక ఉపయోగిస్తే.. బెడ్ షీట్లు, టవల్స్, బట్టలు ఎలాంటి వాసన రాకుండా ఉంటాయి.
కర్పూరం:
బట్టల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. మీరు బట్టలు ఉతికే సమయంలో కర్పూరాన్ని పొడి చేసి సర్ఫ్‌లో ఉపయోగించండి. వాషింగ్ మెషీన్‌లో కూడా సర్ఫ్‌తో పాటు కలిసి కర్పూరం పొడి వేయండి. దీని వలన బట్టలపై ఉండే బ్యాక్టీరియా, వాసన పోతాయి.
గాలి బాగా తగలాలి:
వర్షా కాలంలో బట్టలు ఆరబెట్టాలి అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కాస్త గాలి తగిలే చోట బట్టలను ఆరబెట్టండి. దీని వలన చెడు వాసన రావు. అలాగే కంఫర్ట్స్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా మంచి సువాసన వస్తాయి. బాగా ఆరబెట్టాలి. అలాగే వాసన వచ్చే బట్టలను అన్నింటితో కలిపేయకుండా.. వాటిని మళ్లీ ఉతికితే బెటర్.
ఇవి కూడా చదవండి
బేకింగ్ సోడా – వెనిగర్:
బేకింగ్ సోడా, వెనిగర్‌తో కూడా బట్టల నుంచి వచ్చే చెడు వాసన తగ్గించవచ్చు. మీరు బట్టలు ఉతికేటప్పుడు బేకింగ్ సోడా లేదా వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇవి బట్టల నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్‌ని తగ్గిస్తాయి.
మెషీన్‌లో మరీ ఎక్కువగా బట్టలు వేయవద్దు:
చాలా మంది ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఇందులో ఓవర్ లోడ్‌గా బట్టలను వేసి ఉతుకుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బట్టలపై ఉన్న మురికి పోదు. దీంతో అవి వాసన వస్తూ ఉంటాయి. కాబట్టి తక్కువగా వేస్తూ నీటిని ఎక్కువగా నింపి ఉతికితే మంచి సువాసన వస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]