Trending news

Kishan Reddy’s key comments on KTR and KCR

[ad_1]

  • కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. సీఎం విచారణ కోరారా?..
  • తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి..
  • వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి..
  • కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్న కిషన్ రెడ్డి ..
Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదు..

Kishan Reddy: కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే చెప్పడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది మా డిమాండ్ అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం. సీఎం విచారణ కోరారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడి తప్పు. కానీ గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన. ఆయన తన ప్రజలతో మాట్లాడాలని తెలిపారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. ఒక్క అవినీతి, కుంభకోణం ఆరోపణ లేకుండా బీజేపీ, శివసేన ప్రభుత్వ పాలన సాగిందన్నారు.
Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారు..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close