Trending news

Kidnap Case: చిత్తూరులో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్..

[ad_1]

  • చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్.
  • కాలేజీకి వెళ్తున్న హేమంత్ & మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను కిడ్నాప్.. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ.
Kidnap Case: చిత్తూరులో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్..

Kidnap Case in Chittoor: తాజాగా చిత్తూరు నగరంలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాలేజీకి వెళ్తున్న హేమంత్, మనోజ్ అనే ఇద్దరు విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు. నిన్న రాత్రి బంగారు పాలెం మండలం మిట్టపల్లిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో రెండు గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దింతో పరస్పరం గొడవ పడ్డ మిట్టపల్లి, వరిగపల్లె గ్రామస్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. ఇకపోతే., గత రాత్రి జరిగిన గొడవల నేపథ్యంలో ఈ ఉదయం ఇద్దరూ కాలేజీ విద్యార్థుల కిడ్నాప్ అయినట్లు గుర్తించారు గ్రామస్థులు.

Heavy Rains: హైదరాబాద్ ను కమ్మేసిన వాన మబ్బులు.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు..

ఈ నేపథ్యంలో వరిగపల్లెకు చెందిన 8 మంది మా పిల్లలను కిడ్నాప్ చేశారని మిట్టపల్లె గ్రామస్తులు అంటున్నారు. ఈ సందర్బంగా చిత్తూరు – బెంగళూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు మిట్టపల్లి గ్రామస్తులు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. సదరు కిడ్నాప్ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close