Trending news

Kerala: ప్రొఫెసరా? డ్యాన్సరా? ఇదేం బ్రేక్ డ్యాన్స్! వీడియో వైరల్

[ad_1]

Kerala Professors Dance On Kala Chashma At College Event Is Winning The Internet

స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అప్పుడప్పుడు ఈవెంట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో గురువులు, విద్యార్థులు సరదాగా గడుపుతుంటారు. సహజంగా విద్యార్థులు చేసే కార్యక్రమాలను స్టేజ్ కింద కూర్చుని వీక్షిస్తుంటారు. మరీ అంతగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే.. టీచర్లు గానీ.. ప్రొఫెసర్లు గానీ కాలు కదుపుతారు. అంతేకానీ అదుపు తప్పరు. విద్యార్థుల ముందు చాలా జాగ్రత్తగా మసులుకుంటారు. అలాంటిది ఓ ప్రొఫెసర్.. స్టూడెంట్స్ కంటే ఎక్కువగా డ్యాన్స్‌తో ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కళాశాలలో ఒక ఈవెంట్ జరిగింది. అంతే ఆ కార్యక్రమంలో ఒక మహిళా ప్రొఫెసర్ అరుణిమా దేవాశిష్ రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. బార్ బార్ దేఖో చిత్రంలోని ‘కాలా చష్మా’కు పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె చీరలోనే డ్యాన్స్ దంచికొట్టింది. స్పాంటేనియస్‌గా చేసిన డ్యాన్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆమె డ్యాన్స్‌తో విద్యార్థులు, సహా ఉపాధ్యాయులు కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఇదిలా ఉంటే అరుణిమా దేవాశిష్ అసిస్టెంట్ ప్రొఫెసరే కాదు.. ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని కూడా తెలుస్తోంది.

ఓ విద్యార్థి మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 10 మిలియన్ల వీక్షణలను సంపాదించింది. చక్కని ఉపాధ్యాయులు దొరికారంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇక సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్ చూసినవారంతా ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. శెభాష్ అంటూ కొనియాడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by theja 🐷 (@thejjjjj_)



[ad_2]

Related Articles

Back to top button
Close
Close