కరోనా వైరస్ భయానికి అన్ని దేవాలయాలు మూసివేత
Closure of all temples for fear of corona virus

ఏదైనా ఆపద, కష్టం వస్తే మనం దేవుడి రక్షణ కోరతాం. కానీ ఇప్పుడు ప్రపంచమే కష్టాల్ల్ పడింది. కరోనా అనే మహమ్మారి
అందరినీ భయపెడుతోంది. చరిత్రలో మొదటిసారి…ప్రపంచం తన కష్టాలు, సుఖాలు అంతా బైవనిర్యయం గా భావించడం లేదు. తొలిసారి…ప్రజలెవరూ తమ గండాన్ని గట్టిక్కించమంటూ గుళ్లూ, గోపురాల చుట్టూ తిరగడం లేదు. అంతెందుకు దైవం కన్నా సైన్సే గొప్పదని ప్రజలు భావిస్తున్నారు. చివరకు కరోనా దైవం ఉనికినే ప్రశ్నిస్తోంది. ఆఖరికి కరోనా దెబ్బకు దేవాలయాలే మూతబడుతున్నాయి.
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ఎఫెక్ట్ తిరుమల శ్రీవారి నీ తాకింది. చిత్తూరు జిల్లా సరిహద్దు జిల్లా అయిన నెల్లూరులో కరోనా ఎమర్దన్సీని ప్రకటించిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మరింత అప్రమత్తమైంది. విదేశాల నుంచి భక్తులు 28 రోజుల పాటు తిరుమలకు రావద్దని కోరింది. అనారోగ్యంతో ఉండేవారు రాకూడదని నిబంధన విధించింది. ఏప్రిల్‌లో ఒంటిమిట్టలో టిటిడి తరపున నిర్వహించే శ్రీరాముని కల్యాణానికి భక్తులను దూరంగా ఉంచనున్నారు. తెలంగాణలో గోల్కొండ కోట, చార్మినార్ తో పాటు వరంగల్ కోటలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
వరంగల్ రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, జోగులాంబ దేవాలయాలను మాత్రం మూసే పరిస్థితి లేకపోవడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో స్వామివారి కల్యాణం అర్చకులకు మాత్రమే పరిమితం కానుంది. మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పిరికి రావొద్దని భక్తులను ఇదివరకే కోరారు. షిర్ధి టూర్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. చిలుకూరుకు నిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటుంటారు. ప్రభుత్వం ఎక్కడా గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించిన నేపథ్యంలో..గురువారం నుంచి చిలుకూరు ఆలయాన్ని కూడా మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్ల్ ప్రధాన అమ్మవారి దేవాలయంగా విరాజిల్లుతున్న ఇంద్రకీలాద్రికి వచ్చేవారి భక్తుల సంఖ్య గణనీయంగా
వంతోయలర దేవాలయాల సన్నిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు.
సిబ్బందికి మాస్క్ లు అందించి.. వాటిని ధరించి విధులు నిర్వహించాలని ఆదేశాలు జారి చేశారు. ఆలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటి కప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. మరోవైపు కరోనా వైరస్ కారణంగా జన సమూహం ఉన్న ప్రాంతాల్లొ ప్రజలు తిరగకూడదని ముందస్తు సూచనల మేరకు దేవాలయాలకు కూడా భక్తుల రద్ది తగ్గింది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయాల్లో, మసిదుల్లో, చర్చిలలో భక్తులు రాకపోవడంతో క్యూ లైన్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో రాకపోవడంతో షాపులలో గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామని షాపు నిర్వాహకులు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు.