Trending news

Karan Johar: ఈ పాప తల్లి ఎవరు.? ట్రోలర్‌కు ఇచ్చిపడేసిన కరణ్‌ జోహార్‌..

[ad_1]

సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు బాలీవుడ్‌ దర్శక – నిర్మాత కరణ్‌ జోహార్‌. తాజాగా ఆయన తన పిల్లల గురించి ప్రశ్నించిన నెటిజన్‌కి తనదైన శైలిలో బదులిచ్చారు. పిల్లలపై ఉన్న ఇష్టంతో 2017లో సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలు యశ్‌, రూహీకి తండ్రి అయ్యారు కరణ్‌ జోహార్‌. ఆ చిన్నారులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తుంటారు. ఇటీవల రూహీ ఫొటోను ఆయన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘రూహీ వర్సెస్‌ సిరి’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘రూహీ తల్లి ఎవరు? దయచేసి ఎవరైనా చెప్పండి. ఈ విషయంలో నేను గందరగోళానికి గురి అవుతున్నా’’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై తాజాగా కరణ్‌ స్పందించారు. పాపకు తండ్రి మాత్రమే కాదు తల్లిని కూడా తానే అనీ.. నెటిజన్‌ అయోమయ స్థితి గురించి.. చాలా ఆందోళన చెందుతున్నాననీ అందుకే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చిందని బదులిచ్చారు. కరణ్‌ సమాధానంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా బదులిచ్చారు అని అంటున్నారు.

కరణ్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో తెలియజేశారు. ఇందులో భాగంగానే 2017 ఫిబ్రవరిలో ఆయన సరోగసి విధానంలో తండ్రి అయ్యారు. తన తండ్రి యశ్‌ జోహార్‌ మీద ఉన్న ప్రేమతో బాబుకు యశ్ అనీ, తల్లి హిరూ మీద ఉన్న అభిమానంతో పాపకు రూహీ అని పేరు పెట్టినట్లు ఆయన తెలియజేశారు. సింగిల్‌ పేరెంట్‌గా పిల్లలను పెంచడం అంత సులభం కాదని అన్నారు. తన పిల్లల సంరక్షణ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. వారి వ్యక్తిగత గోప్యతకు ఏమాత్రం భంగం కలిగినా తాను సహించనని గతంలో చెప్పారు. అందుకే వారిపై ఎవరైనా ట్రోల్స్‌ చేస్తే వెంటనే స్పందిస్తానని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close