Kangana Ranaut: సమస్య నాలో ఉందా.? వారిలో ఉందా.? అంటూ కొత్త కాంట్రవర్శీలో కంగనా రనౌత్.

[ad_1]
కంగనని, కాంట్రవర్శీలను వేరు చేసి చూడలేం అన్నది నార్త్ సైడ్ ఎప్పుడూ వినిపించే మాట. ఉన్నదున్నట్టు చెప్పేయడానికి ఆమె ఎప్పుడూ వెనకాడరు.. అందుకే ఏం చెప్పినా కాస్త ఘాటుగానే ఉంటుంది అన్నది నియర్ అండ్ డియర్స్ ఇచ్చే స్టేట్మెంట్.
విషయం ఏదైనా కంగన ఇన్వాల్వ్ అయ్యారంటే నేషనల్ లెవల్లో ట్రెండ్ కావాల్సిందే.! ఇప్పుడు ఎమర్జెన్సీ విషయంలో అవుతున్నట్టు.. సమస్య నాలో ఉందా? వారిలో ఉందా? అంటూ సరికొత్త కాంట్రవర్శీకి తెర దీశారు నటి కంగన రనౌత్.
నా వరకు నేను మంచి వ్యక్తిని, నా చుట్టూ ఉన్న వారితో మర్యాదపూర్వకంగానే ప్రవర్తిస్తున్నాను. నాకు ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే కొంతమందికి మాత్రమే నాతో సమస్య ఉంది అంటున్నారు కంగన.
సల్మాన్, షారుఖ్, ఆమీర్ సినిమాల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండదని, అందుకే తాను వారితో సినిమాలు చేయడానికి ఇష్టపడలేదని మొన్నటికి మొన్న చెప్పారు ఫైర్ బ్రాండ్.
బాలీవుడ్ నిస్సహాయ ప్రదేశమని, ఎవరిలోనైనా టాలెంట్ ఉందనిపిస్తే, వారికి తొక్కేయడానికి పీఆర్‌లను నియమిస్తారని ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. కంగన నటించిన ఎమర్జెన్సీ సెప్టెంబర్ 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎమర్జెన్సీకి సంబంధించి తనకు రకరకాల బెదిరింపులు వస్తున్నాయని ఆల్రెడీ కంగనా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ల వరకూ.. ఆమె ఇంకెన్ని విషయాల గురించి మాట్లాడుతారోనని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫైర్‌బ్రాండ్ ఫాలోయర్స్.
[ad_2]