Trending news

Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..

[ad_1]

  • పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్
  • క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి.
  • హిందీ వర్షన్ లో ఏకంగా 4.5 మిలియన్ నిమిషాల వ్యూస్..
Kalki 2898 AD: మరోసారి గ్లోబల్ లెవెల్లో అదరగొడుతున్న కల్కి..

Kalki 2898 AD On OTT Netflix: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్., యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులే కాకుండా.. వివిధ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అనేకమంది ముఖ్య నటినటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 1200 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా సినిమాను మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేశారు. తెలుగుతో సహా మిగతా దక్షిణ భాషలకు సంబంధించిన కల్కి సినిమాను అమెజాన్ ప్రైమ్ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ జరుగుతుండగా హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Kolkata Doctor Murder: డాక్టర్ ను హత్య చేసి ఫ్రెండ్ దగ్గరకెళ్లి ప్రశాంతంగా పడుకున్న సంజయ్ రాయ్

ఇకపోతే కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతోంది. నాన్ ఇంగ్లీష్ లిస్టులో గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో కల్కి రెండో స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటివరకు హిందీ వర్షన్ లో ఏకంగా 4.5 మిలియన్ నిమిషాల వ్యూస్ సంపాదించింది. అతి తక్కువ టైంలో ఈ ఫీట్ అందుకున్న ఓ ఇండియన్ సినిమా ఇదేనంటూ సమాచారం. దీన్నిబట్టి చూస్తే కల్కి గ్లోబల్ మేనియా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్లుగా కనబడుతోంది. చూడాలి మరి ముందు ముందు రోజుల్లో ఓటీటీలో కల్కి సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close