Kaivalya Vohra: 21 ఏళ్లకే రూ. 3600 కోట్ల సంపద.. ఎవరీ కైవల్య వోహ్రా..

[ad_1]
- 21 ఏళ్లకే 3600 కోట్ల సంపద..
-
హూరన్ రిచ్ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడు.. -
జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా..

Kaivalya Vohra: హూరన్ రిచ్ లిస్ట్ -2024 దేశంలో అత్యంత ధనవంతుల జాబితాను ప్రకటించింది. గౌతమ్ అదానీ ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో నిలిచారు. ముఖేష్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. అయితే, ఈ జాబితాలో ఓ పేరు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. కౌవల్య వోహ్రా.. 21 ఏళ్ల ఈ కుర్రాడి సంపద రూ. 3600 కోట్లు. హూరన్ రిపోర్టులో అత్యంత చిన్న వయసు కలిగిన ధనవంతుడిగా నిలిచారు.
Read Also: IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
క్విక్ కామర్స్ యాప్ ‘జెప్టో’ సహవ్యవస్థాపకుడిగా కైవల్య వోహ్రా అందరికి సుపరిచితం. ఇతడితో పాటు మరో సహవ్యవస్థాపకుడు 22 ఏళ్ల ఆదిత్ పాలిచా జాబితాలో రెండో చిన్న వయస్కుడిగా ఉన్నారు. వోహ్రా, పాలిచాలు ఇద్దరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. వీరు కంప్యూటర్ సైన్స్ కోర్సుని మధ్యలోనే వదిలేసి, ఎంటర్‌ప్రెన్యూషిప్ అభ్యసించారు. కోవిడ్ మహమ్మారి రోజుల్లో అవసమైన వస్తువులను త్వరగా కాంటాక్ట్ లెస్‌గా డెలివరీకి పెరుగుతున్న డిమాండ్‌ని వీరిద్దరు గమనించి, 2021లో జెప్టోని ప్రారంభించారు.
జెప్టో అనతికాలంలోనే భారతదేశంలో హైపర్ కాంపిటీటివ్ గ్రాసరీ డెలివరీగా మారింది. ప్రస్తుతం జెప్టో అమెజాన్ ఇండియా యూనిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, బిగ్ బాస్కెట్‌కి పోటీదారుగా ఉంది. 19 ఏళ్ల వయసులోనే కైవల్య వోహ్రా IIFL వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో తన అరంగేట్రం చేసాడు. అప్పటి నుంచి ఈ లిస్టులో ఆయన పేరు కనిపిస్తోంది. 2024 హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య మొదటిసారిగా 300ని దాటింది.
[ad_2]