Jupally Krishna Rao : సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో జానపద కళారూపాలకు పునర్జీవం

[ad_1]

తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పునర్జీవం తీసుకువచ్చేందుకు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని… రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుందని.కవులు, కళాకారులు, రచయితలకు సముచితస్థానం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో. రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై. ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు. కథలు, నాటికలు వేసే జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని. దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారని మంత్రి పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక. కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప. ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారన్నారు. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే. ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించే కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై ఉందని తెలిపారు.
Maharashtra: బీఫ్ మటన్ తీసుకెళ్తున్నాడని.. రైలులో వృద్ధుడిపై యువకులు దాడి
[ad_2]