Trending news

JC Prabhakar Reddy: తన అనుచరులకు జేసీ స్వీట్‌ వార్నింగ్.. వదిలిపెట్టను..!

[ad_1]

  • తన అనుచరులకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి వార్నింగ్..

  • నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారు..

  • వారు వెంటనే పద్దతి మార్చుకోవాలన్న జేసీ..

  • నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు…

  • ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్‌ వార్నింగ్‌..
JC Prabhakar Reddy: తన అనుచరులకు జేసీ స్వీట్‌ వార్నింగ్.. వదిలిపెట్టను..!

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. తన అనుచరులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణాపై స్పందించిన ఆయన.. నియోజకవర్గంలో 25 మంది ఇసుక రవాణా చేస్తున్నారు.. వారు వెంటనే పద్దతి మార్చుకోవాలి.. ఇసుక తరలింపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. గతంలో ఇసుక అక్రమరవాణా అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గుర్తుచేసుకున్న ఆయన.. నా కోసం ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేసి నాకు దూరం కావద్దు అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు..

Read Also: Burkina Faso: బుర్కినా ఫాసోలో మళ్లీ చెలరేగిన హింస.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి..!

మరోవైపు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తాం అన్నారు జేసీ.. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టను అని వార్నింగ్‌ ఇచ్చారు.. అక్రమ ఇసుక రవాణాదారులకు ఇదే జేసీ ప్రభాక‌ర్ రెడ్డి చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు.. తాడిపత్రిలో ఇసుక తోలేది 25 మందే.. మీ అందరూ నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవారు. కానీ, ఇసుకతో నాకు దూరం కావద్దు అని సూచించారు. నేను కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంతో పోగుట్టుకున్నాను.. అలా అని నేను వెళ్లి ఇసుక తోడుకోవడం లేదు కదా? అని ప్రశ్నించారు. అవసరం అయితే మున్సిపాలిటీ ద్వారా ఇసుక రవాణా చేద్దాం.. దాంతో.. మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేద్దామని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి.



[ad_2]

Source link

Related Articles

Back to top button
Close
Close