Trending news

Jay Shah: జైషా కంటే ముందు ఐసీసీ పీఠంపై కూర్చొన్న భారతీయులు వీరే.. లిస్టులో ఆ పొలిటికల్ లీడర్ కూడా

[ad_1]

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా జే షా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 ఏళ్ల జయ్ షా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు. ఇక ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడిగా కూడా జైషా రికార్డు సృష్టించారు. ఇంతకీ, భారతదేశం నుండి ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం రండి. జై షా కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను నలుగురు భారతీయులు పాలించారు.వారు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, శశాంక్ మనోహర్. ఇప్పుడు ఈ పదవిని చేపట్టిన ఐదవ భారతీయుడిగా జైషా నిలిచారు.

  1. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయుడు జగ్మోహన్ దాల్మియా. అవును.. కోల్ కతాలోని ప్రతిష్టాత్మకమైన దాల్మియా కంపెనీకి యజమానిగా ఉన్నప్పటికీ మొదటి నుంచి క్రికెట్ ఆటపై ఆసక్తి ఉన్న దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.
  2. NCP అధినేత శరద్ పవార్ అత్యంత ప్రభావవంతమైన భారతీయ రాజకీయ నాయకులలో ఒకరు. రాజకీయాల్లోనే కాదు క్రికెట్‌నూ కూడా ఆయన శాసించాడు. 2010 నుండి 2012 వరకు రెండేళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధ్యక్షుడిగా ఉన్నాడు శరద్ పవార్. భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడైన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు.
  3. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మాజీ ఛైర్మన్‌లలో ఎన్ శ్రీనివాసన్ కూడా ఒకరు. ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన మూడో భారతీయుడు. 2014-2015 మధ్య ఐసీసీ చైర్మన్‌గా ఉన్నారు. రెండేళ్ల పదవీకాలం పూర్తికాకముందే ఆయనను పదవి నుంచి తప్పించారు. వ్యాపారవేత్త ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అవినీతి, స్పాట్ ఫిక్సింగ్ కేసుల్లో ఆయన పేరు వినిపించింది. దీంతో అతను పదవికి దూరమయ్యాడు.
  4. జూన్ 2014లో ఐసిసి ఛైర్మన్‌గా ఎన్నికైన ఎన్ శ్రీనివాసన్ రెండేళ్ల పదవీకాలం పూర్తికాకముందే వైదొలగడంతో అప్పటి బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఐసిసి అధ్యక్షుడయ్యారు. భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ 2016లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని ఐసీసీలో కొనసాగారు.
  5. ఇప్పుడు భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా మరోసారి జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబరు 1 నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. భారత్ నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 5వ వ్యక్తి జైషా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

[ad_2]

Related Articles

Back to top button
Close
Close