Trending news

Jawahar Nagar Dog Cruelty Incident | Street Dogs Brutally Killed

[ad_1]

  • జవహర్ నగర్ వీధికుక్కలపై విచక్షణారహితంగా దాడి
  • వెంటాడి వీధికుక్కల్ని కర్రలతో కొట్టి చంపిన దుండగులు
Satanic : పైశాచికం.. వెంటాడి  వీధికుక్కల్ని కర్రలతో కొట్టి చంపిన దుండగులు

Satanic : జవహర్ నగర్ వీధికుక్కలను విచక్షణారహితంగా చంపకూడదని, వాటి జనాభా నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరిధిలోకి రావాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే..! కానీ ఎలాంటి సోయి లేకుండా ఇష్టానుసారంగా కుక్కలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.

Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. ఓ శునకం కడుపుతో ఉన్నాకూడా వదిలేయకుండా, మరో మూడు కుక్కలను సైతం విచక్షణారహితంగా కర్రలతో మోది కుక్కలను కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించి నిందుతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Fire Accident In Train: గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం



[ad_2]

Related Articles

Back to top button
Close
Close