Jaishankar on china: భారత్‌కే కాదు.. చైనాతో ఇతర దేశాలకు కూడా సమస్యే..

[ad_1]
- చైనాపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్..
-
భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయి.. -
ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఆ దేశం గురించి చర్చించుకుంటున్నారు: జై శంకర్

Jaishankar on china: చైనాపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్ చేశారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలు చైనా నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పుకొచ్చారు. వాటితో పోలిస్తే భారత్‌కు ఉన్న సమస్య ఇంకాస్త ఎక్కువన్నారు. ‘‘సరిహద్దు వివాదం కారణంగా చైనాతో మనకు ముప్పు కొనసాగుతుంది అన్నారు. ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా ఆ దేశం గురించి చర్చించుకుంటూనే ఉంటారని ఆయన అన్నారు. యూరప్ వెళితే చైనా నుంచి ఎదురవుతున్న ఆర్థిక, జాతీయ భద్రత ముప్పు గురించి తెలియజేస్తు్న్నారు.. అమెరికా వెళ్లినా ఇదే ఇష్యూ.. కాబట్టి చైనాతో భారత్‌కు మాత్రమే సమస్య అని భావించకూడదని జై శంకర్ అన్నారు.
Read Also: Poonam Kaur : ట్విట్టర్ లో పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవరినుద్దేశించో తెలుసా..?
ఇక, దశాబ్దాల క్రితం ప్రపంచ దేశాలు చైనా సమస్యను పెద్దగా పట్టించుకోలేదని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారిపోయింది.. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు డ్రాగన్ కంట్రీతో మనకున్న సమస్యను మరింత తీవ్రంగా పరిగణించాలి.. మరీ ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్నందున భారత్ లాంటి దేశాలు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.. డ్రాగన్ కంట్రీ దేశం నుంచి పెట్టుబడుల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. చైనా నుంచి పెట్టుబడులు ఆహ్వానించకూడదని గానీ, ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోవొద్దు అని గానీ ప్రభుత్వం అనుకోవడం లేదన్నారు. అక్కడి నుంచి వచ్చే పెట్టుబడుల విషయంలో నిశిత పరిశీలన చాలా అవసరం.. కేవలం చైనా నుంచి వచ్చే పెట్టుబడులు మాత్రమే కాదు.. ఏ పెట్టుబడుల విషయంలోనైనా ఆచితూచి వ్యవహరించాల్సిన అవకాశం ఉందని కేంద్రమంత్రి జైశంకర్ అన్నారు.
[ad_2]