Trending news

Jagan Mohan Reddy: ‘మనం గుడ్‌ బుక్‌ పెడుదాం’.. మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు

[ad_1]

వైసీపీ అధినేతన, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్ బుక్‌ అంశంపై జగన్‌ తొలిసారి స్పందించారు. తాజాగా బుధవారం మంగళగిరిలీ వైసీపీ నేతలంతో జరిగిన భేటీలో జగన్‌ కీలక ఇందుకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెడ్‌ బుక్‌ మెయింటేన్‌ చేయడం పెద్ద పనా.? అంటూ జగన్‌ ప్రశ్నించారు. మనం గుడ్‌ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుదామంటూ పార్టీ శ్రేణులకు జగన్‌ పిలుపునిచ్చారు.

మంచి చేసినవాళ్ల పేర్లను గుడ్‌బుక్‌లో నోట్ చేసుకుందామంటూ జగన్‌ వ్యాఖ్యానించారు. అప్పుడు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వచ్చినా ఢీ అంటే ఢీ అనేలా ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు రావడం సర్వసాధరమణన్న జగన్ కష్టాల నుంచే హీరోలు పుడతారన్నారు. అసలైన నాయకులు పుట్టేది కూడా ఇప్పుడేనని జగన్‌ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా మంగళగిరలో బలమైన అభ్యర్థి ఉండాలనే ఉద్దేశంతోనే వేమారెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించామని జగన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి జగన్ తీసుకొచ్చిన గుడ్‌ బుక్‌ అంశంపై టీడీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

[ad_2]

Related Articles

Back to top button
Close
Close