Jagadish Reddy: ముందుంది ముసళ్ల పండుగ.. పోలీసులకు మాజీ మంత్రి వార్నింగ్
[ad_1]
- ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతుంది
- ఉన్నవి కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే ఆలోచన లేదు
- ఈ తెలివి ప్రభుత్వానికి లేదు
- రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టారు
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఉన్నవి కూలగొట్టడం తప్ప.. కొత్తవి నిర్మించే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు దద్దమ్మలాగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ, గోదావరి నీళ్ల విషయంలో ఇద్దరు మంత్రులకు అవగాహన లేదని మండిపడ్డారు. మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయని.. పంటలు ఎండిపోతున్నాయన్నారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితులే.. ఈ తొమ్మిది నెలలో కనిపిస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Musi River: మూసీ ఒడ్డున కూల్చివేతలకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ స్టార్ట్..
ఖమ్మం జిల్లా మంత్రుల అత్యాశ వల్లే నాగార్జునసాగర్ కెనాల్ కు రెండు చోట్ల గండి పడిందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తమ హయాంలో సాగర్ కాలువకు గండి పడితే ఏడు రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు.. కానీ ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదన్నారు.
రాష్ట్రంలో అప్పుడే పోలీసు రాజ్యం మొదలుపెట్టారని మండిపడ్డారు. జిల్లా ఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులు నిబంధనలను అతిక్రమించి చిన్న తప్పు చేసినా శిక్షకు అర్హులు అవుతారన్నారు. ఇంకా నాలుగేళ్లు ఉంది.. ముందుంది ముసళ్ళ పండుగ.. అప్పుడే ఏం మొదలైందన్నారు. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్రంలో రైతు భరోసాని అమలు చేయాలన్నారు.
READ MORE: Konda Surekha: గత పాలకుల విమర్శలు పట్టించుకోం.. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం
[ad_2]