Trending news

Israel – Lebanon: లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

[ad_1]

లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తడాఖా చూపింది. వరుస దాడులతో విరుచుకుపడటంతో కీలక కమాండర్లు హతమయ్యారు. ఇబ్రహీం అకీల్ సహా కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా హెజ్బొల్లా సైనిక వ్యవస్థ దాదాపు విచ్చిన్నమైందని ఇజ్రాయిల్ ప్రకటించింది. బీరుట్ పై శుక్రవారం చేపట్టిన క్షిపణుల దాడుల్లో దాదాపు 37 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో హెజ్బొల్లా నెం. 2 ఇబ్రహీం అకీల్‌తో పాటు కీలక కమాండర్ అహ్మద్ మహ్మద్ వాహ్బీ ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

హెజ్బొల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు ఎనిమిది మంది కీలక సైనిక కమాండర్లతో కూడిన మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ ఫోటోను ఐడీఎఫ్ ఎక్స్ లో పోస్టు చేసి.. వీరిలో ఇప్పటి వరకూ ఆరుగురిని మట్టుబెట్టినట్లు తెలిపింది. అకీల్, ఫాద్ ఘక్ర్ , విస్సమ్ ఆల్ తావిల్, అబు హసన్ సమీర్, తాలెబ్ సమీ అబ్దుల్లా, మహమ్మద్ నాసర్‌లు హతమైన వారిలో ఉన్నారని, సంస్థ చీఫ్ నస్రల్లా, సదరన్ ఫ్రంట్ కమాండర్ ఆలీ కరాకీ , బేడర్ యూనిట్ కమాండర్ అబూ ఆలీ రిదాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిపింది. తమ పౌరులకు హాని కలిగించే ఉగ్రశక్తులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close