Trending news

IPL Auction: సీఎస్కే లేదా రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్లాలని ఉందన్న టీమిండియా బౌలర్

[ad_1]

టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐపీఎల్ లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స తరఫున ఆడతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. తన మాజీ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన కోసం 2025 ఐపీఎల్ మెగా వేలంలో బిడ్ చేసే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాడు. గతంలో చాలా కాలం పాటు CSK తరపున ఆడిన చాహర్, 2022 సీజన్‌కు CSK రిటైన్ చేసుకోలేదు అయితే వేలంలో అతడిని రూ. 14 కోట్లకు కొనుగోలు చేశారు. ఇటీవల జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో, మళ్లీ CSK తరపున ఆడాలని తన కోరికను వ్యక్తం చేసిన చాహర్, పవర్‌ప్లే ఓవర్లలో వికెట్లు తీయగల తన నైపుణ్యం ప్రస్థుత క్రికెట్లో తన బలమని అదే తనకు ఉపయోగపడుతుందని తెలిపాడు.

చాహర్ గతంలో గాయాల కారణంగా చాలా మ్యాచ్‌లు మిస్ అయినప్పటికీ, గతంలో సీఎస్కే తరఫున అతని ప్రదర్శనే మరోసారి ఆ జట్టు తన కోసం బిడ్డింగ్ వేసేలా చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు.  “గత మెగా వేలంలో కూడా వారు నన్ను రిటైన్ చేసుకోలేదు, కానీ నా కోసం భారీ ధరకు వేలంలో పోటీ పడ్డారు. ఈ సారి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ నాకున్న నైపుణ్యాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాను. క్రికెట్ రాను రాను బ్యాట్స్మెన్ కు ఫేవర్ గా మారుతోంది. పవర్‌ప్లేలో 90-100 రన్స్ వరకు స్కోర్ వస్తోంది, దీంతో జట్లు 200 పైగా స్కోర్ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది . నేను పవర్‌ప్లేలో రన్స్ కట్టడి చేయగల ముఖ్యమైన ఆటగాడిగా నిరూపించుకున్నాను,” అని చాహర్ పేర్కొన్నాడు.

వేలానికి ముందు CSK కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే, మతీషా పతిరానాలను రిటైన్ చేసుకుంది. CSK వద్ద ఇప్పుడు రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ లేదు. “నేను మళ్లీ CSK తరపున ఆడాలని అనుకుంటున్నాను,  సీఎస్కే కాకుంటే రాజస్థాన్ రాయల్స్ నా కోసం బిడ్ చేయాలని కోరుకుంటున్నాను” అని చాహర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. చూడాలి మరి మేగా వేలంలో సీఎస్కే దీపక్ చాహర్ ను కొనుగోలు చేస్తుందా లేక రాజస్థాన్ రాయల్స్ అతని కోసం పోటీ పడుతుందా లేదా తెలియాలంటే నవంబర్ 24 వరకు వేచి చూడాల్సిందే.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close