Trending news

IPl Auction: ఆ సఫారీ ఆటగాడు కోట్లు కొల్లగొట్టడం ఖాయం: దినేష్ కార్తిక్

[ad_1]

IPl Auction: ఆ సఫారీ ఆటగాడు కోట్లు కొల్లగొట్టడం ఖాయం: దినేష్ కార్తిక్

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో జెరాల్డ్ కోయెట్జీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కోయెట్జీ కొత్త బంతిని స్వింగ్ చేయడమే కాదు చేంజ్ ఆఫ్‌ పేస్ తో డెత్ ఓటర్లలో వికెట్లు కూడా తయగలడు. అంతే కాదు బ్యాటంగ్ లోను చివర్లో సిక్సర్లు కొట్టే నైపుణ్యం ఉన్న ఆటగాడు కోయోట్జీ. ఈ టాలెంటెడ్ ప్లేయర్ కోసం రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో ప్రాంచైజీలు కాసులు కుమ్మరించడం ఖాయమన్ని మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.

 

“దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనికి ఎంత ఇస్తోందో నాకు తెలియదు, కానీ రెండు వారాల్లో అతను పెద్ద మొత్తంలో చెక్ తీసుకుంటాడు అనిపిస్తోంది. కోయెట్జీ తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతనో తెలివైన క్రికెటర్ అని ప్రశంచించాడు. ఒక బౌలర్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా సేవలు అందించే ఈ ఆల్ రౌండర్ కోసం వేలంలో ప్రాంచైజీలు పోటీ పడటం ఖాయమన్నారు. ఇలాంటి ఆటగాళ్లు ఉండటం దక్షిణాఫ్రికాకు అదృష్టమన్నారు. ఆ జట్టు బ్యాటింగ్ డెప్త్ ఎంత  ఉంది అని చెప్పడానికి మార్కో జాన్సెన్ ఏడు స్థానంలో, కోయెట్జీ ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయగలగడం ఒక ఉదాహరణ” అని కార్తిక్ తెలిపాడు.

 

టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ కూడా కోయెట్జీ ని ఆకాశానికెత్తాడు. అతడికి బ్యాటింగ్ లో కూడ మంచి నైపుణ్యం ఉంది. తాను ఒక బౌలర్ అయినప్పటికి బ్యాటర్ గా కూడా సేవలు అందించడం నిజంగా గొప్పవిషయమన్నారు. దీనికోసం అతను ఎంతో శ్రమిస్తున్నాడనిపిస్తోంది. ఆటలో అన్ని భాగాల్లోనూ తన పాత్ర ఉండాలని కోయోట్జీ కోరుకుంటున్నాడు.

 

కోయెట్జీ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. 10 మ్యాచులు ఆడిన అతడు 13 వికెట్లు తీసి 10.18 ఎకానమీతో మంచి ప్రదర్శనను కనబరిచాడు. గత సీజన్ లో ఐపీఎల్ వేలంలో 5 కోట్ల ధరకు ముంబై అతన్ని దక్కించుకుంది.  ఈ నెల 24, 25 తేదీలలో జెడ్డా, సౌదీ అరేబియాలో జరగనున్న ఐపీఎల్ 2025 ప్లేయర్ ఆక్షన్ కోసం 1574 ఆటగాళ్లు నమోదు చేసుకున్నారని బీసీసీఐ ప్రకటించింది.

[ad_2]

Related Articles

Back to top button
Close
Close