Indigo Flight: కోల్‌కతా ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. కారణం ఏంటంటే..?

[ad_1]
- కోల్‌కతా ఎయిర్పోర్టులో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం -
టేకాఫ్ తర్వాత ఎడమ ఇంజిన్ లో లోపం.

కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. టేకాఫ్ తర్వాత, ఇండిగో విమానం 6E0573 యొక్క ఎడమ ఇంజిన్ లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
Read Also: Vijayawada: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం
ఈ విషయంపై విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ.. కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం శుక్రవారం రాత్రి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు శుక్రవారం రాత్రి 10.36 గంటలకు బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ 6E0573.. ఎడమ ఇంజిన్ లోపం కారణంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ (NSCBI) విమానాశ్రయంలో రాత్రి 10.53 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
Read Also: Viral video: నడిరోడ్డుపై ఈవ్‌టీజర్‌ను చితకబాదిన యువతులు
ఈ క్రమలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. విమానంలో మంటలు లేదా నిప్పురవ్వలు ఎలాంటివి సంభవించలేదన్నారు. రాత్రి 10.39 గంటలకు జారీ చేసిన ఎమర్జెన్సీని రాత్రి 11.08 గంటలకు ఉపసంహరించుకుందని తెలిపారు. NSCBI విమానాశ్రయం రెండు రన్‌వేలలో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి అప్పగించామన్నారు. టేకాఫ్ తర్వాత విమానం ఎడమ ఇంజన్ చెడిపోయిందని.. అందుకే తిరిగి కోల్‌కతాకు వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
[ad_2]