Indian Idol Season 3: ఈ వారం ఎంటర్టైన్మెంట్ డబుల్ ధమాకా.! తమన్ సీక్రెట్స్ లీక్..

[ad_1]
దీపావళికి పేలుస్తాం పటాకా.. ఈ వారం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది డబుల్ ధమాకా.. యస్.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లో డబుల్ ధమాకా విత్ ప్లేబ్యాక్ సింగర్స్ స్పెషల్ ఎపిసోడ్ ఈవారం ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో జనాలను యమాగా అట్రాక్ట్ చేస్తోంది. అందులోనూ స్పెషల్ గెస్ట్ తమన్ గురించి చెప్పిన సంగతులు ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.
ఆహా తెలుగు ఇండియన్ ఐడల్‌లో టాప్ 6 కంటెస్టంట్లున్నారు. వారికి ప్లేబ్యాక్ సింగర్స్ మిక్స్ అయి ఇచ్చే సపోర్ట్ వేరే లెవల్ అని ప్రోమో చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.
ఒక్కో పెర్ఫార్మెన్సూ గ్లింప్స్ చూస్తే చాలు.. ఫుల్ సాంగ్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతోంది. ఈ ఎపిసోడ్లో తమన్ గురించి ఆయన తల్లి చెప్పిన మాటలు హైలైట్.
ఈ వారం ఎపిసోడ్లో సూపర్ ఉమెన్‌గా ఎంట్రీ ఇచ్చారు తమన్ తల్లి. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి కొడుకు పుట్టాడని కాంప్లిమెంట్స్ ఇస్తూనే, తమన్ చిన్నతనంలో చేసిన అల్లరి గుట్టువిప్పేశారు సూపర్ మదర్.
తమన్ సీక్రెట్స్ రివీల్ అయిన ఈ ఎపిసోడ్‌ని అస్సలు మిస్ కాకూడదనే ఫీల్ కలిగిస్తోంది ప్రోమో. జస్ట్ అంతే కాదు.. యామిని వేసిన స్టెప్పులు, మహేష్ పాటకు కార్తిక్ చేసిన డ్రాయింగ్, బంతిపూల బుట్టను గీతా డ్రా చేసిన తీరు..
ఇలాంటివి ఎన్నెన్నో చూసి వినోదాన్ని ఆస్వాదించాలంటే అస్సలు మిస్ కాకూడదు ఈ వారం ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్స్. ఆగస్టు 30, 31 సాయంత్రం ఏడు గంటలకు తప్పక చూడండి.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఎపిసోడ్స్.
[ad_2]