Income Tax: మోదీ పాలనలో ఇన్‌కమ్ ట్యాక్స్ మ్యాజిక్.. పదేళ్లల్లో ఐదు రెట్ల పెరుగుదల

[ad_1]
సాధారణంగా మధ్య తరగతి ప్రజలు అంటే సంవత్సరానికి రూ.20 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారని అర్థం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని పదేళ్ల ప్రభుత్వ హయాంలో మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే రూ. 50 లక్షలు దాటి వార్షికాదాయం ఉన్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని వెల్లడైంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ డేటా ప్రకారం 2023-24లో రూ. 50 లక్షలకు పైగా వార్షిక ఆదాయాన్ని చూపుతున్న వ్యక్తుల సంఖ్య 2013-14లో 1.85 లక్షల నుంచి ఐదు రెట్లు పెరిగి 9.39 లక్షలకు పెరిగింది. అలాగే రూ. 50 లక్షలకుపైగా సంపాదిస్తున్న వారి ఆదాయపు పన్ను బాధ్యత 3.2 రెట్లు పెరిగిందని, 2014లో పన్ను చెల్లింపులు రూ. 2.52 లక్షల కోట్లుగా ఉంటే 2024 నాటికి రూ. 9.62 లక్షల కోట్లకు చేరుకుందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశానికి లభించే ఆదాయపు పన్నులో 76 శాతం ఈ వర్గాల నుంచే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోదీ పాలనలో ఆదాయపు పన్ను చట్టంలో తెచ్చిన కీలక సంస్కరణలతో పాటు బ్లాక్ మనీ విషయంలో తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందని పేర్కొంటున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]