Trending news

IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

[ad_1]

  • బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

  • పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన
IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం గుజరాత్‌లో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్లు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రంగంలోకి దిగిన సహాయ బృందాలు.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: Kolkata rape-murder: మమతా బెనర్జీ ‘‘కిమ్ జోంగ్ ఉన్’’.. దాడిని తీవ్రతరం చేసిన బీజేపీ..

ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ రెండో అల్పపీడనం పశ్చిమ దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు. దీని కారణంగా గుజరాత్, సౌరాష్ట్ర మరియు కచ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు. కేరళ, దక్షిణ కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఈ రోజు జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే గుజరాత్‌లో సంభవించిన వరదలు కారణంగా 26 మంది చనిపోయారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: Reliance AGM 2024: అంబానీ దెబ్బతో భారీగా పెరిగిన షేర్లు.. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.20.58 లక్షల కోట్లు!



[ad_2]

Related Articles

Back to top button
Close
Close