Trending news

If you look at the advance bookings of varun Tej starrer Matka, you will surprised

[ad_1]

  • వరుణ్ తేజ్ తాజా రిలీజ్ మట్కా
  • వరల్డ్ వైడ్ గా మట్కా గ్రాండ్ గా రిలీజ్ అయింది
  • ఓవర్సీస్ బుకింగ్స్ మేకర్స్ కు గట్టి షాక్
Matka : దారుణంగా మెగా హీరో మట్కా ఓవర్సీస్ బుకింగ్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ఆ అనగా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

Also Read : suriya : కంగువా ఓవర్సీస్ పబ్లిక్ టాక్ .. సూర్య హిట్ కొట్టాడా..?

కాగా ఓవర్సీస్ లో కొన్ని గంటల ముందుగా మట్కా విడుదలవుతోంది. అయితే ఓవర్సీస్ లో ఎటువంటి సినిమాకైనా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా కీలకం. మిడ్ రేంజ్ హీరో సినిమా కూడా ఓ మోస్తారు గా బుకింగ్స్ రాబడతాయి. కానీ వరుజ్ తేజ్ నటించిన మట్కా అడ్వాన్స్ బుకింగ్స్ చుస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఓవర్సీస్ ప్రీమియర్స్ స్టార్ట్ అయ్యే నాటికీ మట్కా అడ్వాన్స్ సేల్స్ చుస్తే 62 లొకేషన్స్ లో 108 షోస్ కు గాను కేవలం 324 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యి $3,564 కలెక్ట్ చేసింది. మెగా ఫ్యామిలీ హీరోకు ఈ బుకింగ్స్ అంటే దారుణం అని ట్రేడ్ వర్గాలు అంచనాలు తేల్చేశాయి. వరుణ్ ట్రేజ్ తోలిప్రేమ సినిమాకు ఓవర్సీస్ లో సూపర్బ్ కలెక్షన్స్ వస్తే మట్కా పరిస్థితి దారుణంగా ఉంది. వరుణ్ గత సినిమాలు డిజాస్టర్స్ ప్రభావం మట్కా పై గట్టిగానే చూపింది. సూపర్ హిట్ టాక్ వస్తే ఏమైనా పుంజుకుంటుందేమో చూడాలి. ఈ సినిమాను శ్లోక ఎంటర్టైన్మెంట్స్ ఓవర్సీస్ రిలీజ్ చేస్తోంది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close