Trending news

HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

[ad_1]

  • ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు..

  • త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం…
HYDRA Law: త్వరలో హైడ్రా చట్టం.. ఏ.వీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

HYDRA Law: హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హైడ్రా’ పేరు మారుమోగుతోంది. పూర్తిగా.. ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్‌ను కమిషనర్‌గా నియమిస్తూ రేవంత్ సర్కార్ ఈ హైడ్రామాకు ప్రత్యేక అధికారాలు కూడా ఇచ్చింది. నగరంలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి.. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటూ.. ఈ హైడ్రామా ఇప్పుడు హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూములను కాపాడేందుకు “హైడ్రా” తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్ డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు.

Read also: Osmania Hospital: 32 ఎకరాల్లో కొత్త ఉస్మానియా దవాఖానా.. ఎక్కడో తెలుసా?

అయితే.. ఈ క్రమంలో ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రా పేరుతో ప్రత్యేక చట్టం చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే హైడ్రామా పేరుతో నిర్వాసితులకు నోటీసులు జారీ చేస్తామన్నారు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను అందుబాటులో ఉంచుతామని, ఇక్కడ ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మరోవైపు బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఇవాళ హైడ్రా నోటీసులు ఇచ్చింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది.
New Ration Cards: తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. అర్హులకు రేషన్‌, ఆరోగ్య కార్డులు..



[ad_2]

Related Articles

Back to top button
Close
Close