Trending news

Hyderabad: గ్రేటర్ వాసులకు అలెర్ట్..! పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

[ad_1]

Hyderabad: గ్రేటర్ వాసులకు అలెర్ట్..! పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

హైదరాబాద్‌ మహానగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి స్కీంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ మహానగర జలమండలి ఓ&యం డివిజన్-2 (బి), బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు జీహెచ్ఎంసీ, ఎస్ఎండీపీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఇబ్బందులు కలగకుండా బాలాపూర్ రిజర్వాయర్ అవుట్ లెట్ 450 ఎంఎం డయా పైపు లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు జలమండలి అధికారుల తెలిపారు.

దీంతో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేసే పరిస్థితి నెలకుందని అధికారులు వెల్లడించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉండడంతో పలు ప్రాంతాలలో నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనులు ఆగస్ట్ 30 శుక్రవారం సాయంత్రం 9 గంటల నుంచి మరుసటి రోజు అనగా ఆగస్ట్ 31వ తేదీ శనివారం రాత్రి 9 గంటల వరకు జరుగుతాయి. కావున ఈ 24 గంటలు కింద పేర్కొన్న బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం కలిగే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎం డివిజన్ – 2బి: రాజా నరసింహ కాలనీ, ఇందిరా నగర్, ఫీసల్‌ బండా, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, GM చౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, DMRL, DLRL, గారిసన్ ఇంజినీర్ -1 & 2, DRDO, మిధాని, ఒవైసీ హాస్పిటల్, BDL, CRPF, కేంద్రీయ విద్యాలయ.

2. ఓ అండ్ ఎం డివిజన్–2ఏ: హస్నాబాద్, ఖలందానగర్, సంతోష్ నగర్, యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, MIGH, HIGH, LIGH కాలనీలు, ఫహబా మసీదు, మారుతీ నగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ.

3. ఓ అండ్ ఎం డివిజన్–10 ఏ: బాబా నగర్, మక్బూల్ నగర్, జీఎం నగర్, క్వాద్రీ కాలనీ.

పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో కొన్ని చోట్ల పూర్తి అంతరాయం, మరికొన్ని చోట్ల పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించు కోవలని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

[ad_2]

Related Articles

Back to top button
Close
Close