Hurun Rich List: ముఖేష్ అంబానీని బీట్ చేసిన గౌతమ్ అదానీ.. మన దేశ నయా కుబేరుడు.. సంపన్నుల పూర్తి లిస్టు ఇదే..

[ad_1]
భారతీయ కలియుగ కుబేరుడు ఎవరంటే వెంటనే ముఖేష్ అంబానీ అని చెప్పేవారు.. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీని బీట్ చేసి నయా అభినవ కుబేరుడుగా అవతరించాడు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ. పోర్టులు, విమానాశ్రయాలు, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ వంటి భిన్న రంగాలలో పనిచేస్తున్న బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇప్పుడు మన దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా మారారు. చాలా కాలంగా నంబర్-1 స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టాడు. గౌతమ్ అదానీ 2023 ప్రారంభంలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను ఎదుర్కోవలసివచ్చింది. దాదాపు ఏడాది తర్వాత ఈ అద్భుతం జరిగింది. అదానీ వ్యాపారంలో ఎదురైన ఒడిదుడుకుల నుండి కోలుకోవడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది. 31 జూలై 2024 వరకు డేటా ను ప్రకటించిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు. ఆయన సంపద రూ.11.6 లక్షల కోట్లు దాటింది.
ప్రతి 5 రోజులకు ఒకరు బిలియనీర్
హురున్ ఇండియా జాబితా ప్రకారం ఈ సంవత్సరం జూలై 31, 2024 వరకు భారతదేశం ప్రతి 5 రోజులకు ఒక బిలియనీర్‌ను సృష్టించింది. ఆసియాలో సంపద సృష్టిలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. అదే సమయంలో చైనాలో సంపద క్షీణిస్తోంది. 2024 నాటికి భారతదేశంలో సంపద సృష్టిలో 29 శాతం పెరుగుదల నమోదైంది. దేశంలో బిలియనీర్ల సంఖ్య 334 కి చేరుకుంది.
జాబితాలో చేర్చబడిన వ్యక్తులు ఎవరంటే
హురున్ ఇండియా రిచ్ ప్రకటించిన ఈ జాబితాలో అదానీ మొదటి ప్లేస్ లో ఉండగా ముఖేష్ అంబానీ రెండో స్థానానికి చేరుకున్నారు. ముఖేష్ అంబానీ సంపద రూ.10.14 లక్షల కోట్లకు చేరింది. 3.14 లక్షల కోట్ల సంపదతో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్.. కుటుంబం ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఎస్. వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ యజమాని పూనావాలా మన దేశంలోనే సంపన్నుల లిస్టు లో నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన దిలీప్ శాంఘ్వీ ఐదో స్థానంలో ఉన్నారు. గత 5 సంవత్సరాలలో భారతదేశంలోని టాప్-10 బిలియనీర్లలో నిరంతరంగా చేరిన వ్యక్తులు 6 మంది ఉన్నారు. ఈ జాబితాలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఆరో స్థానంలో, గోపీచంద్ హిందూజా ఏడో స్థానంలో, రాధాకృష్ణ దమానీ ఎనిమిదో స్థానంలో, అజీమ్ ప్రేమ్‌జీ తొమ్మిదో స్థానంలో, నీరజ్ బజాజ్ కుటుంబం పదో స్థానంలో నిలిచారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
[ad_2]