Health: తరచూ కడుపు నొప్పికి కారణాలు ఏంటి.? ఎలా బయటపడాలి..

[ad_1]
కడుపు నొప్పి సర్వసాధారణమైన సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. అయితే కడుపు నొప్పిని ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి రావడానికి తీసుకునే ఆహారం మొదలు, ఎన్నో రకాల కారణాలు ఉంటాయయి. కడుపు నొప్పికి సంబంధించి త్వరగా చికిత్స తీసుకుంటే సమస్య నుంచి ఇట్టే బయపడొచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదం తప్పదని అంటున్నారు. ఇంతకీ కడుపు నొప్పి రావడానికి గల పలు ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* కడుపు నొప్పికి ప్రధాన కారణాల్లో వైరల్ డయేరియా ఒకటి. కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో కడుపు నొప్పి సమస్య వేధిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సమస్య దానంతట అదే తగ్గుతుంది. కానీ దీర్ఘకాలంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* పెప్టిక్ అల్సర్ కారణంగా కూడా కడుపు నొప్పి వేధిస్తుంది. కడుపు లైనింగ్‌లోని అల్సర్‌లు కూడా నిరంతర కడుపు నొప్పికి కారణమవుతాయి. పదేపదే కడుపు నొప్పి వస్తుంటే పెప్టిక్ అల్సర్‌గా భావించాలని నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి తీవ్రమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
* ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల కూడా కడుపు నొప్పికి దారి తీస్తుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచుగా కడుపు నొప్పిని సమస్య ఎదువుతుంటే.. మీకు ఫుడ్ అలర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. కొన్ని రకాల ఫుడ్స్ కారణంగా కడుపు నొప్పి వస్తుంది.
* కొన్న సందర్భాల్లో కడుపు నొప్పి క్యాన్సర్‌కు కూడా సంకేతంగా భావించాలని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంగా కడుపు నొప్పి వేధిస్తుంటే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిది.
* జీవనశైలిలో మార్పులు కూడా కడుపు నొప్పికి కారణమవుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న జీవితం, స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ వంటివి అధికంగా తీసుకోవడం వల్ల కూడా కడుపు నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు
ఈ జాగ్రత్తలు పాటించాలి..
కడుపు నొప్పి సమస్య బారిన పడకుండా ఉండాలంటే.. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో హోటల్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో మైదా, ఆయిల్ ఫుడ్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపులో మంటగా ఉంటుంది. ఇక తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. ఆకుకూరలను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. స్మోకింగ్, డ్రింకింగ్‌ను మానుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువసార్లు తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]