Harish Shankar: ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వందనం’ అంటూ.. హైడ్రాపై డైరెక్టర్ ఏమన్నారంటే..?

[ad_1]
- తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ‘హైడ్రా’పై స్పందించిన డైరెక్టర్ హరీష్ శంకర్
-
హైడ్రా కూల్చివేతలపై ‘X’లో స్పందించిన నాగబాబు.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ‘హైడ్రా’పై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పందించారు. ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తూ.. ‘ప్రకృతిని గౌరవిద్దాం. మరియు విచ్ఛిన్నమైన వ్యవస్థపై ఫేక్ మేకప్ చేయడానికి ప్రయత్నించకుండా, గొప్ప భవిష్యత్తు కోసం పునాదులను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి @revanth_anumula ప్రభుత్వానికి నేను వందనం చేస్తున్నాను’ అని తెలిపారు .
Read Also: Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ కంటెస్టెంట్లు.. వారి బ్యాగ్రౌండ్ ఇదే!
‘హైడ్రా, అక్రమంగా ఆక్రమించబడిన మన సరస్సు.. నీటి వనరులను శుభ్రపరచడం, నాలాలను పునరుద్ధరించడం, మూసీకి జీవం పోయడంతో పాటు భావి నగరం కోసం ఒక దార్శనికతతో పాటు మీరు రాబోయే ఎన్నికల గురించి రాజకీయ ఆలోచన కాదు, తరువాతి తరం గురించి ఆలోచించే రాజనీతిజ్ఞుడు అని నాకు గొప్ప విశ్వాసం. మీరు నిజమైన దూరదృష్టి గలవారు.. మిషన్‌లో ఉన్న వ్యక్తి.’ అని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ మరియు తెలంగాణ ప్రజలారా, మనమందరం మన ప్రియమైన సీఎం రేవంత్ రెడ్డి గారు.. హైదరాబాద్‌ను నిజంగా గొప్పగా, గౌరవనీయమైన మహానగరంగా మార్చడానికి ఆయన శక్తిని రెట్టింపు చేద్దాం’. అని పేర్కొన్నారు.
Let us respect nature. And I salute the government of Revanth Reddy @revanth_anumula garu, which is not trying to do fake make-up on a broken system but trying to strengthen the foundations for a great future.
HYDRAA, clearing our illegally-occupied lake and water bodies,…
— Harish Shankar .S (@harish2you) September 1, 2024
Read Also: IC 814 Hijack: నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘IC 814’పై వివాదం..హైజాకర్లకు హిందూ పేర్లు.. అసలు నిజం ఇదే..
మరోవైపు.. హైడ్రా కూల్చివేతలపై నాగబాబు’X’లో స్పందించారు. ‘ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేయటం వల్లే చెరువులు, నాలాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ సీఎం రేవంత్ హైడ్రా కాన్సెప్ట్. పర్యావరణాన్ని మనం రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది. అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే.. కచ్చితంగా మనల్ని అదే శిక్షిస్తుంది’. అని నాగబాబు పేర్కొన్నారు. నాగబాబుకు ట్వీట్ కు హీరో సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అయ్యారు.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 1, 2024
[ad_2]