Hanuman SJ Surya: అందుకే ‘హనుమాన్’ సినిమాలో ఎస్‌జే సూర్య లేరు: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

[ad_1]
- హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.
- ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
- తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన.

Hanuman Movie SJ Surya: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ వరల్డ్ లో వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఆడియన్స్ ముందుకు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ కూడా అదిరిపోయే స్పందన ఈ సినిమాకు వచ్చింది. ఇకపోతే అతి త్వరలోనే ఈ సినిమాకు సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన హీరో నాని ప్రధానపాత్రలో నటించిన ‘సరిపోదా శనివారం’ కార్యక్రమంలో భాగంగా డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
Bigg BossTelugu 8: బిగ్‌బాస్ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!
‘సరిపోదా శనివారం’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఎస్ జె సూర్య గురించి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడాడు. ఎస్ జె సూర్య ఓ అద్భుతమైన దర్శకుడుతోపాటు మంచి నటుడని ఆయన కొనియాడారు. అయితే తాను తెరకెక్కించిన హనుమాన్ సినిమాలో ఓ పాత్ర కోసమని ఎస్ జె సూర్యను అనుకునట్లు ఆయన తెలిపారు. కానీ., ఆయన రెమ్యునరేషన్ దృష్టిలో పెట్టుకొని తాము ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. అయితే సినిమాలో ఏ పాత్రకు ఎస్ జె సూర్యను అనుకున్నారన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇకపోతే హనుమాన్ సినిమాలో వినయ్ రాయ్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న ఎస్‌జే సూర్య.. గత కొంతకాలంగా ఆయన నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక తెలుగు, తమిళ సినిమాలలో నటించి మెప్పించారు.
ICC Womens T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన..
[ad_2]
Source link