Hair Fall Control Foods: ఏం తింటే జుట్టు రాలడం తగ్గుతుందో తెలుసుకోండి..

[ad_1]
జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, బలంగా ఉండాలని ప్రతీ అమ్మాయి కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ఆహారం, నీరు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ కాలంలో జుట్టు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే కాస్త కష్టమే. కానీ మీరు కాస్త జాగ్రత్తలు పాటిస్తే జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జుట్టును ఒత్తుగా, పొడుగ్గా పెంచే చిట్కాలు ఇప్పటికే ఎన్నో తెలుసుకున్నాం. మరిన్ని కొత్త చిట్కాలు ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. జుట్టు రాలడానికి ఒక్క కారణం అంటూ చెప్పలేం. చాలా రకాల కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. వాతావరణ మార్పుల కారణంగా కూడా జుట్టు అనేది రాలుతూ ఉంటుంది. జుట్టు సంరక్షణతో పాటు మీరు రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవడం వల్ల జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. జుట్టు రాలకుండా ఉండేందుకు ఏం తినాలో ఇప్పుడు చూద్దాం.
గుడ్లు:
జుట్టు బలంగా ఉండేందుకు ప్రోటీన్ ఎంతో హెల్ప్ చేస్తుంది. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు పెరిగేందుకు సహాయ పడుతుంది. వీటితో పాటు కెరాటిన్, బయోటిన్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్‌గా ఉండేలా చేస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఓ గుడ్డు తినడం అలవాటు చేసుకోండి.
పాలకూర:
పాల కూరలో కూడా ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. విటమిన్ బి, ఐరన్‌తో పాటు ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాల కూర జుట్టును బలంగా ఉంచడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా శరీరంలో ఇమ్యూనిటీని కూడా పెంచి.. ఇతర వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
ఇవి కూడా చదవండి
నట్స్:
ప్రతి రోజూ ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసిన విషయమే. వీటిని తినడం వల్ల జట్టు కూడా బలంగా, దృఢంగా మారుతుంది. జుట్టు రాలకుండా కుదుళ్లను బలపరుస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
చేపలు:
చేపలు తినడం వల్ల కూడా అనేక పోషకాలు అందుతాయి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ ఉంటుంది. ఇవన్నీ జుట్టుకు మంచి బలాన్ని అందిస్తాయి. ఇవి తలను ఆరిపోకుండా.. జుట్టు మందంగా ఉండేలా చేయడంలో సహాయ పడుతుంది.
మెంతులు:
ప్రతి రోజూ రాత్రి పూట నానబెట్టిన మెంతుల్ని తినడం వల్ల కూడా జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు అనేవి దాదాపుగా తగ్గిపోతాయి. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు ఎంతో చక్కగా పని చేస్తాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
[ad_2]