Trending news

Gully Boy Bhaskar: ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్.. గల్లీ బాయ్ భాస్కర్ జంట ఎంత బాగుందో చూశారా?

[ad_1]

Gully Boy Bhaskar: ప్రియురాలిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్.. గల్లీ బాయ్ భాస్కర్ జంట ఎంత బాగుందో చూశారా?

‘పటాస్’ షోలో స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించాడు భాస్కర్. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ చేస్తూ ఆడియెన్స్ ను అలరించాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లాంటి టీవీషోల్లోనూ మెరిశాడు. తన కామెడీతో ‘గల్లీ బాయ్’ భాస్కర్ గా బాగా ఫేమస్ అయ్యాడు.ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నాడీ కమెడియన్. అలాగే శ్రీదేవీ డ్రామా కంపెనీ టీవీ ప్రోగ్రామ్ లోనూ కనిపిస్తున్నాడు. ఓ వైపు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే మరోవైపు అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పిస్తున్నాడు గల్లీ బాయ్ భాస్కర్. వీటి సంగతి పక్కన పెడితే.. ఇటీవలే తన ప్రియురాలిని పరిచయం చేశాడు భాస్కర్. ఆమె పేరు మానస. తనెవరో పూర్తి వివరాలు తెలియట్లేదు కానీ ఇటీవల మానసతో కలిసి పలు రీల్స్, వీడియోలు చేస్తున్నాడు భాస్కర్. అంతేకాదు ఆమెతో కలిసి ఫొటోలను షేర్ చేసుకుంటూ ‘మై లవ్’ అంటూ లవ్ ఎమోజీలతో పోస్టులు షేర్ చేస్తున్నాడు. భాస్కర్, మానస రెండేళ్ల క్రితం మొదటిసారి కలుసుకున్నారని, అప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తరచూ మానసతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జబర్దస్త్ కమెడియన్. అందులో ఆమెపై ప్రేమ వర్షం కురిపిస్తున్నాడు. ‘మన ఈ రెండేళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు. కానీ నువ్వు అన్ని సందర్భాల్లోనూ నా వెంట ఉన్నావు. తోడుగా నిలిచావు. థ్యాంక్యూ మానస. లవ్యూ’ అంటూ కొన్ని రోజుల క్రితమే ఒక ఎమెషనల్ పోస్ట్ పెట్టాడు భాస్కర్.

మానసతో గల్లీ బాయ్ భాస్కర్..

 

View this post on Instagram

 

A post shared by Bhaskar (@gully_boy_bhaskar)

మొత్తానికి భాస్కర్, మానస ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పోస్టులు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతన్నాయి. వీరిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జోడీ చాలా బాగుందంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా కొన్ని నెలల క్రితమే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు గల్లీ బాయ్ భాస్కర్. పూజాది కార్యక్రమాలతో గ్రాండ్ గా గృహప్రవేశం నిర్వహించాడు.

రెండేళ్లుగా ప్రేమలో భాస్కర్, మానస..

 

View this post on Instagram

 

A post shared by Bhaskar (@gully_boy_bhaskar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close