Trending news

Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..

[ad_1]

  • భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..

  • సెక్షన్ 306 ఐపీసీ కింద నేరాన్ని ఆకర్షించలేము..

  • ఎఫ్ఐఆర్‌ని రద్దు చేసిన గుజరాత్ హైకోర్టు..
Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..

Gujarat High Court: వివాహేత సంబంధానికి సంబంధించిన కేసులో గుజరాత్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య వివాహేతర సంబంధం కలిగి ఉండటం, భర్త ఆత్మహత్యకు కారణం కాకపోయి ఉండొచ్చని చెప్పింది. మహిళ, ఆమె భాగస్వామిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని హైకోర్టు కొట్టేసింది. తన కొడుకు మరణానికి అతడి భార్య వివాహేతర సంబంధమే కారణమని ఆరోపిస్తూ మృతుడి తల్లి కేసు పెట్టింది. అయితే, ఎఫ్ఐఆర్‌లోని విషయాలు నిజమని అంగీకరించినప్పటికీ, మరణించిన వ్యక్తి ఆత్మహత్యకు ప్రేరేపించే ఉద్దేశం సదరు మహిళకు ఉందని నిర్దారించలేదని హైకోర్టు పేర్కొంది.

Read Also: Daisuke Hori: 12 ఏళ్లుగా.. రోజుకు 30 నిమిషాలే నిద్ర.. ఫిట్ నెస్ మాత్రం అదుర్స్..

జస్టిస్ దియేష్ ఏ జోషితో కూడిన సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మృతుడి భార్యకు ఆత్మహత్యకు ప్రేరేపించే ఉద్దేశం ఉందని చెప్పలేమని, కాబట్టి ఈ కేసులో సెక్షన్ 306 IPC కింద నేరాన్ని ఆకర్షించలేమని చెప్పారు. కేవీ ప్రకాస్ బాబు వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్నాటక కేసుని గుజరాత్ హైకోర్టు ప్రస్తావించింది. వివాహేతర సంబంధం అనేది తప్పనిసరిగా సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం నేరారోపణకు దారి తీయదనే సుప్రీంకోర్టు తీర్పును పేర్కొంది. ఇది విడాకులు లేదా ఇతర వైవాహిక ఉపశమనాలకు దారి తీయెచ్చని చెప్పింది.

సెక్షన్ 306 ఐపీసీ ప్రకారం.. ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడితే, అలాంటి ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించినా, ఎవరు సహకరించినా పదేళ్ల వరకు పొడగించబడే జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది. ‘‘మరణించిన వ్యక్తి తల్లి బాధను మేం అర్థం చేసుకుంటాం. వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. కోర్టు సానుభూతి మరియు ఫిర్యాదుదారు బాధను చట్టబద్ధంగా అనువదించలేము.’’ అని ఎఫ్ఐఆర్‌ని రద్దు చేస్తూ కోర్టు తీర్పుచెప్పింది.



[ad_2]

Related Articles

Back to top button
Close
Close