Govt Schools Closed: గంగానదిలో పెరిగిన నీటిమట్టం.. పాట్నాలో 76 గవర్నమెంట్ స్కూల్స్ మూసివేత

[ad_1]
- బీహార్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలు..
-
అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న గంగా నది.. -
76 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్..

Govt Schools Closed: భారతదేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల దాటికి బీహార్ రాష్ట్ర రాజధానిలోని గంగా నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం భారీగా పెరుగి పోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. పాట్నా జిల్లాలోని పలు పాఠశాలలను అధికారులు క్లోజ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు 76 ప్రభుత్వ పాఠశాలలను ఆగస్టు 31వ తేదీ వరకూ మూసి వేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే పాట్నా సమీపంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన టీచర్ గంగా నదిలో పడి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.
Read Also: Jagadish Reddy: మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు..
దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. ఇక, బీహార్ ప్రభుత్వం ఇటీవల జిల్లా మేజిస్ట్రేట్‌లకు అధికార పరిధిలోని తమ పరిధిలో వరదల లాంటి పరిస్థితి ఏర్పడితే స్కూల్స్ ను మూసివేసేందుకు అధికారం ఇచ్చింది.. ఈ క్రమంలో పాట్నా జిల్లాలోని 76 గవర్నమెంట్ స్కూల్స్ కు జిల్లా యంత్రాంగం సెలవులు ఇచ్చింది.
Terrible form of Ganga river pic.twitter.com/yu01sVk3EM
— Mobarak Hossain (@Mobaraktweets) August 26, 2024
[ad_2]