Gorantla Butchaiah Chowdary: టీడీపీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారు..

[ad_1]

Gorantla Butchaiah Chowdary: టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ దుర్మార్గపు చర్యలు నచ్చక పోవడం కారణంగానే పలువురు నాయకులు పార్టీ వీడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జగన్ స్వయంకృత ఫలితం కారణంగానే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొందరు టీడీపీలో చేరుతున్నారని మరికొంతమంది చేరే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా టీడీపీలో చేర్పించుకుంటున్నారని వస్తున్న ఆరోపణలను బుచ్చయ్య చౌదరి ఖండించారు. వైసీపీ నేతలను తీసుకోవలసిన కర్మ మాకు ఏంటి …? మాకు ఉన్న బలం మాకు ఉందన్నారు.
Read Also: MP Purandeswari: బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి..
రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం చిన్నాభిన్నం అయ్యిందని ఆరోపించారు.. గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అరాచక శక్తులకు అండగా నిలిచారని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న కృషికి కేంద్రం నుంచి ఫలితం కనబడుతుందన్నారు. ఇసుక పాలసీలో నూతన విధానాలు రూపొందిస్తున్నామని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వెల్లడించారు. ఇందువల్ల ఇసుక సరఫరాలో జాప్యం జరుగుతుందని అన్నారు. కొంతమంది అధికారులకు ఇంకా పాత వాసన పోలేదని.. వారిని దారిలోకి తీసుకువస్తామని అన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తామన్నారు.
Read Also: Amaravati Farmers: రాజధాని రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. 15వ తేదీలోగా ఖాతాల్లోకి సొమ్ము..
వైసీపీ నేతలు తప్పుడు ప్రచారంతో బతకాలని అనుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఎందుకు తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని అన్నారు బుద్ధిలేని మాజీ ముఖ్యమంత్రి అధికారులచే తప్పుడు పనులు చేయించారని ఆరోపించారు. ఆధారాలు బయటపడుతుంటే మార్ఫింగ్ అంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు అక్రమాలు చేసిన అధికారులపై విచారణ కొనసాగుతుందని అన్నారు. రాజమండ్రిలో బ్రాహ్మణుల, కాపుల భూములను వైసీపీ నేతలు తప్పుడు డాక్యుమెంట్లతో ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
[ad_2]